ఎవరెన్ని చెప్పినా.. ఏం చేసినా.. మా పద్దతి మాదే. మేం ఎవరి మాటా వినం. అంతకంతకూ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితికి అప్పుతోనే మందు వేస్తాం తప్పించి.. మరింకేమీ చేయమన్నట్లుగా వ్యవహరిస్తూ.. తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. మరోసారి అప్పు బాట పట్టక తప్పలేదు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. తన ఖర్చులకు మరోసారి అప్పు చేయక తప్పలేదు.
ఉమ్మడి రాష్ట్రంతో పాటు.. విభజన జరిగిన మొదటి ఐదేళ్లతో కలిపి పాలకులు చేసిన అప్పుకంటే ఎక్కువగా గడిచిన మూడేళ్లలో ఏపీలోని జగన్ సర్కారు భారీగా అప్పుచేసిన వైనం తెలిసిందే.
రికార్డు స్థాయికి చేరుకున్న ఏపీ అప్పుల కారణంగా.. వాటికి చెల్లించాల్సిన వడ్డీతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు.. పింఛనుదారులకు సమయానికి జీతాలు.. పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఏ నెలకు ఆ నెల అప్పులు చేస్తే కానీ ప్రభుత్వ బండి లాగలేని పరిస్థితి.
ఇప్పటికే ఏపీ తీసుకున్న అప్పుల మీద కేంద్రం నుంచి ఆర్థిక నిపుణులు వరకు అందరూ ఆందోళన చేస్తున్నారు. ఈ మధ్యనే వేసిన లెక్కల ప్రకారం ఏపీలోని ప్రతి ఒక్కరి మీద రూ.5లక్షల వరకు రుణం వేలాడుతోందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. అయినప్పటికీ ఇలాంటి మాటల్ని.. హెచ్చరికల్ని బేఖాతరు చేయని ఏపీ ప్రభుత్వం తాజాగా మరో రూ.2వేల కోట్లను అప్పుగా తీసుకుంది.
రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొన్న ఏపీ సర్కారు రూ.వెయ్యి కోట్ల అప్పును పద్దెనిమిదేళ్ల కాలపరిమితో చెల్లించేలా 7.13 శాతం వడ్డీకి తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 19 ఏళ్ల కాలపరిమితో చెల్లించేలా అదే వడ్డీకి తీసుకుంది.
ఇవాల్టి రోజున సామాన్యులు తీసుకునే ఇంటి రుణంపైనా మామూలు బ్యాంకులు ఆరు శాతం నుంచి ఏడు శాతం మధ్యంలో రుణాలు ఇస్తుంటే.. ప్రభుత్వం రిజర్వు బ్యాంకు వద్ద 7.13 శాతానికి వడ్డీకి తీసుకోవటం గమనార్హం. ఇంత వడ్డీ రేటుకు తీసుకున్న అప్పుల్ని ఏపీ ఎప్పటికి తీరుస్తుందో చూడాలి.