రాజు వెడలి అరణ్యవాసానికి.. జాడేలేదు.. చినబాబే కనిపిస్తున్నాడు. కేసీఆర్ ఎక్కడ? అన్న ప్రశ్న? ఇప్పుడు అందరి నోటా వ్యాపిస్తోంది. తెలంగాణలో కరోనా కల్లోలం వేళ పెద్ద సార్ కనపడక జనాలు ఆగమాగమవుతున్నారు.
అయినా ఈ కరోనా పాడుగాను అందరికీ వ్యాపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలన్నా తేడా దానికి లేదు. ఈ పక్షపాతం లేని మహమ్మారి చేయబట్టి ఏపీ, తెలంగాణలో అందరూ వణికిపోతున్నారు.
తాజాగా కరోనా కాటు కల్లోలం సృష్టిస్తోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. డబ్బులేని వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడుతున్న బాధలు రోజుకో వీడియో చొప్పున వస్తూ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఏపీ తెలంగాణలో ఇప్పటికే చెరో 20వేల కేసుల చొప్పున పెరిగి పరిస్థితి దారుణంగా ఉంది.
ఇలాంటి క్లిష్ట సమయంలో పేద రాష్ట్రమైనా ఏపీ సీఎం జగన్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్సను తెచ్చాడు. ఇన్నాళ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఫ్రీ ఉండగా.. ఇప్పుడు ప్రైవేట్ లోనూ ఏపీ ప్రజలు కరోనా చికిత్స తీసుకునేలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు.ఇప్పుడీ నిర్ణయం జగన్ పై ప్రశంసలు కురిసేలా చేస్తోంది. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్.జవహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు
ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇక ఏపీ ప్రజలు కరోనా చికిత్సను ఉచితంగా చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రైవేట్ ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. నాన్ క్రిటికల్ కరోనా పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3250, ఐసీయూలో వెంటిలేటర్ల వైద్యానికి రోజుకు రూ.5480, వెంటిలేటర్ వైద్యానికి రోజుకు రూ.9580, వెంటిలేటర్ లేకుండా వైద్యం చేస్తే రూ.6280గా ఖరారు చేసింది.దీంతో ఇక ఏపీలోని తమకు నచ్చిన మెరుగైన ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా ప్రజలు ఉచితంగా కరోనా చికిత్సను తీసుకోవచ్చు.
మరో విశేషం ఏంటంటే రేషన్ కార్డు లేని కరోనా రోగులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే పేదలు, ధనికులు తేడా లేకుండా అందరికీ ఉచిత కరోనా చికిత్స ఏపీలో సాధ్యమన్నమాట.. జగన్ సర్కార్ చేసిన ఈ సాహసోపేతమైన నిర్ణయంపై నిజంగానే ప్రశంసలు కురుస్తున్నాయి.
కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం ఇంకా ఆ ఊసే లేదు. కరోనాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చస్తున్నామంటూ బతికించాలని జర్నలిస్టులు, సామాన్యులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయినా కనీసం కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో కేసీఆర్ సర్కార్ చేర్చలేదు. ఇక ప్రైవేట్ లో లక్షల ఫీజులు కట్టలేక చితికిపోతున్న ప్రజలకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ప్రపంచానికి పెను శాపమైన ఈ కరోనాను ఏపీలోలాగే ఆరోగ్యశ్రీలో చేర్చి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించేలా కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెలంగాణలో వ్యక్తమవుతోంది.