కరోనా వైద్యం: తెలంగాణ, ఏపీల్లో ఎంత తేడా?

Update: 2020-06-26 15:30 GMT
ఎంత తేడా ధనికరాష్ట్రంలో తెలంగాణలో కరోనా చికిత్స ఎంత భారమవుతోంది. ఎన్ని బతుకులు చితికిపోతున్నాయి. పక్కనున్న రాజధాని కూడా లేని అప్పుల రాష్ట్రం ఏపీలో కరోనా చికిత్స ఎంత చీప్.. పైగా పారితోషికం.. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రజల ప్రాణాలకు ఇస్తున్న విలువ ఎంత? పక్క రాష్ట్రం ఏపీలో ప్రజల బాగోగుల కోసం ఏం చేస్తున్నారు? వీటిపై ఓ లుక్ వేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

లాక్డౌన్ పరిమితులు సడలించినప్పటి నుంచి కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. మెజారిటీ ప్రజల జీవనోపాధి కోసం ఉద్యోగాలు.. చిన్న వ్యాపారాలపై ఆధారపడి ఉంటారు కాబట్టి వారు ఎప్పటికీ వైరస్ కు భయపడి ఇంట్లో ఉండలేరు. ప్రజలు పనికి వెళ్ళకపోతే వారు తమ కుటుంబాలను పోషించుకోలేరు. దీంతో కరోనా అంటువ్యాధి అందరికీ ప్రబలుతూనే ఉంది.

కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో, కరోనా రోగులకు చికిత్స చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం ఉచిత చికిత్సను కొనసాగిస్తోంది. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటికే తెలంగాణలో కోవిడ్ -19 రోగులకు చికిత్స ప్రారంభించాయి.

మహమ్మారి రోగులకు చికిత్స చేయడంలో కార్పొరేట్ ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను ఆమోదించింది. రోజుకు సాధారణ బెడ్ అయితే రూ .4 వేలకు మించకూడదని.. ఆక్సిజన్ ఉన్న బెడ్ కు రూ .7,500, వెంటిలేటర్ సహాయంతో ఐసియూలో ఉంటే ఒకరోజుకు రూ .9,000 వసూలు చేయాలని నిర్ధేశించింది.

దీన్ని బట్టి ఒక రోగి 10 రోజులు ఐసియూలో ఉన్నట్టు అయితే రూ .90,000 ఖర్చవుతుంది. కానీ . వాస్తవానికి, అదనపు ఛార్జీలు, బెడ్ ఛార్జీలు అంటూ ఇతర రుసుములు కన్సల్టేషన్ లు కలుపుకొని మొత్తం సుమారు రూ .1.5 లక్షలు బిల్స్ వేస్తున్నారట.. ఇది సాధారణ ఆస్పత్రుల్లోనే.. కార్పొరేట్ లో ఎంతలేదన్నా రూ.10 లక్షలు దాటుతున్నాయి..

ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయిన కొందరు కరోనా రోగులు తమ బిల్లులను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఒక రోగి ఇటీవల హైదరాబాద్‌లోని పేరున్న కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. ఐదు రోజుల చికిత్స తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం బిల్లు రూ .3.5 లక్షలు.

తెలంగాణ ప్రభుత్వం లెక్క ప్రకారం ఐదు రోజులు కరోనా చికిత్సకు 72,000 మాత్రమే తీసుకోవాలి కానీ 3.5 లక్షలు వసూలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన బిల్లు మొత్తం బిల్లులో ఐదవ వంతు మాత్రమే కావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.. ఇందులోనే సదురు కార్పొరేట్ ఆస్పత్రి పిపిఇ కిట్ల ఛార్జీలను వసూలు చేశారు. ఇది బిల్లులో 45,000గా వేశారు.. ఇందులో వాడే మందుల ధర రూ .72,000. ల్యాబ్ టెస్టుల పేరిట 53,000 బిల్లులో పేర్కొన్నారు. ఐదు రోజుల బిల్లు మూడున్నర లక్షలు అయితే, రోగి 14 రోజుల పాటు ఉంటే? అతడు సంపాదించిన సొమ్ము అంతా ఆస్పత్రి ఖర్చులకే పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రుల పరిస్థితి ఇది.

ఈ కరోనా వైరస్ చికిత్సలు ఆరోగ్య బీమా పాలసీల పరిధిలో ఉన్నాయా లేవా దానిపై ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఉంటే వాటిని అమలు చేయాలని బీమాలు తీసుకున్న వారు కోరుతున్నారు.

మరోవైపు, పొరుగున ఉన్న ఏపీలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలు ఉచితం, ఒక వ్యక్తి పాజిటివ్‌గా పరీక్షించబడితే అతనికి చికిత్స ఉచితంగా ఇవ్వబడుతుంది. రోగులకు ఎటువంటి ఛార్జీ లేకుండా పోషకమైన ఆహారం ఇస్తారు. దాని పైన, చికిత్స తీసుకున్న తరువాత డిశ్చార్జ్ అయిన రోగికి ప్రభుత్వం రూ .2,000 ఇస్తోంది.

కొంతమంది దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసి తెలంగాణ ప్రభుత్వం తీరును ఏపీ ప్రభుత్వంతో పోలుస్తూ ఎగతాళి చేస్తారు. జగన్ ప్రభుత్వం డబ్బు ఇవ్వడం వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే, సంక్రమణను రహస్యంగా ఉంచకుండా చూడడమే. అతని కుటుంబం మరియు పరిసరాల్లో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చికిత్స కోసం ముందుకు రావడానికి పేద ప్రజలను ప్రోత్సహించడమే ఈ జగన్ ప్రభుత్వం 2వేలు కానుకగా ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేసుకోకుండా ఉండేవారికి డబ్బులు వస్తాయి.. తరువాత బతుకు భరోసా ఉంటుందని ముందుకు వస్తున్నారు.
Tags:    

Similar News