ఏపీలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ తాజాగా మద్యం దుకాణాల సమయాన్ని గంట పెంచింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకే మూతపడాల్సి ఉండగా.. తాజాగా మరో గంట సమయాన్ని పొడిగించింది. అయితే ఈ గంట సమయం పెంపు మందుబాబుల కోసం కాదు. దీనికి ప్రత్యేక కారణం ఉంది.
ఏపీలో మద్యం దుకాణాలకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించడం.. అకౌంట్లను సరిచేయడం.. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయడానికి అవసరమైన బిల్లులను రూపొందించడం కోసమే అదనంగా గంట సమయాన్ని పొడిగించినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
గంట సేపు పెంచారనగానే మద్యం అమ్మకాలు ఉంటాయని మందుబాబులు ఆశపడ్డారు. కానీ చివరి గంటలో మద్యం అమ్మకాలు ఉండబోవని స్పష్టం చేశారు. అమ్మకాలు రాత్రి 8 గంటలకే క్లోజ్ అవుతాయి. మద్యంపై పర్యక్షేణ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఏపీలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తుండడంతో ప్రత్యేకంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. అందుకే 8 గంటలకే క్లోజ్ చేస్తే లెక్కలు పత్రాలు చేయడం కష్టమవుతోంది. వచ్చిన ఆదాయాన్ని ఏరోజుకారోజు ప్రభుత్వ ఖాజానాకు జమ చేయాల్సి ఉంటుంది. కొన్ని షాపుల నుంచి వారం రోజుల వరకు ఆదాయం జమ చేయడంలో జాప్యం జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.