ఏపీ మంత్రివర్గానికి బీజేపీ రోడ్‌మ్యాప్ ఇచ్చిందా.. మంత్రికి బీజేపీ కోటానా?
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయినా ఇంకా రాజకీయ చర్చలు మాత్రం ఆగడం లేదు. కొత్త మంత్రివర్గ ఏర్పాటు వెనక చాలా అంశాలు ముడిపడి ఉన్నాయంటూ రోజుకో విషయం ప్రచారంలోకి వస్తోంది. నిజానికి ఒకరిద్దరు పాత మంత్రులను కొనసాగించి సీఎం జగన్ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి.
కానీ జగన్ మాత్రం ఏకంగా 11 మంది పాత మంత్రులను కొనసాగించారు. సామాజిక సమీకరణాలు ఇతర అంశాలను ఆయన దృష్టిలోకి తీసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే కొనసాగించిన మంత్రుల్లో ఒకరైన ఆదిమూలపు సురేష్ విషయంలో జగన్‌పై కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి పెట్టిందనే ప్రచారం జోరందుకుంది.
జగన్ అధికారంలోకి వచ్చినపుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఆదిమూలపు సురేష్‌కు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. జగన్‌తో సమీక్షలు ఆయన్ని సీఎంకు మరింత దగ్గర చేశాయి. పైగా వైఎస్సార్ కడప జిల్లా ఇంఛార్జీగా సురేష్ ఉండడంతో జగన్కు మరింత సన్నిహితమయ్యారని టాక్. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన మంత్రివర్గంలో సురేష్‌ను కొనసాగించి ఈ సారి మరింత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని చేశారు.
అయితే సురేశ్ మంత్రి పదవిని కాపాడుకోవడం వెనక కేంద్రంలోని బీజేపీ ఉందని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన భార్య ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సురేష్‌తో పాటు ఆయన భార్యపైనా సీబీఐ విచారణ పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు మంత్రి పదవి పోతే ఆ కేసులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తన భార్యతో కేంద్రంలో ఒత్తిడి తెచ్చారని టాక్.
మరోవైపు సురేష్‌కు పోటీగా మంత్రి పదవి ఆశించిన తిప్పేస్వామి ఆయనకు బంధువే కావడంతో ఇద్దరు ఓ అవగాహనకు వచ్చారని తెలిసింది. ఈ విషయాన్నే జగన్ దృష్టికి తీసుకువెళ్లిన సురేష్ మంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మంత్రి పదవి కోసం ఒత్తిడి తెచ్చినప్పటికీ సురేష్ కేంద్రం నుంచి నరుక్కొచ్చారని సమాచారం.
తెరవెనక ఢిల్లీ పెద్దలతో మాట్లాడించి ఆయన రెండోసారి మంత్రివర్గంలో కొలువు దీరారని చెబుతున్నారు. అంటే ఏపీ మంత్రవర్గానికి కేంద్రంలోని బీజేపీ రోడ్‌మ్యాప్ ఇచ్చిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కోటాలోనే సురేశ్‌కు మరోసారి జగన్ మంత్రి పదవి కట్టబెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.