ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇరు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ సమరం జరుగుతోంది. తాజాగా.. ఏపీ మంత్రి ఆదిమూల పు సురేష్ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఉద్దేశించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు. అంతేకాదు.. త్వరలో ఊచలు లెక్కపెట్టేందుకు రెడీగా ఉండాలని హెచ్చరించారు.
కార్మికుల ప్రాణాలంటే లెక్క లేకుండా వారికి రావాల్సిన మందులు, ఆరోగ్య పరికరాల్లో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు త్వరలో జైలుకు వెళ్లి ఊచలు లెక్క పెట్టనున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, తాను హోమంత్రి పదవి చేపట్టి వైసీపీ నాయకుల భరతం పడతానని అచ్చెన్నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం షెడ్యూలు కులాల్లో ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే.. వైసీపీ ప్రభుత్వంలో 4 పదవులిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ది అని పేర్కొన్నారు.
"చంద్రబాబు.. మీ పని అయిపోయింది. 2019లో 23 సీట్లు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో మూడే వస్తాయి" అని పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్ల కోసం ఫరూక్‌కు మంత్రి పదవి ఇచ్చిందని, లేదంటే మైనారిటీలకు చోటే లేదని విమర్శించారు. "జగన్‌ది రామరాజ్యమని.. చంద్రబాబుది రాక్షస పాలన"అని పేర్కొన్నారు. బడుగులకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.