వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఇటీవల కాలంలో కొత్త నినాదం అందుకున్నారు. అదే వైనాట్ 175. అంటే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలకు 175 స్థానాల్లో ఎందుకు గెలవలేమని ఆయన భావన. దీనినే ఆయన తన పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు. మొత్తం అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకుని తీరాలని అంటున్నారు.
అయితే, దీనిని ఎవరు ఎలా తీసుకుంటున్నారో తెలియదు కానీ, కీలక నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాత్రం దీనిని పక్కన పెట్టేశారు. ఇది సాధ్యం కాదు.. అన్నట్టుగా మాట్లాడేశారు.
వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని ఆయన తేల్చి చెప్పారు. సాధ్యమైనన్ని అంటే.. 175 అయితే కాదు! గత ఎన్నికల్లో వచ్చిన 151 కి మరో రెండో మూడో లేక పోతే పదో అనుకోవచ్చు.
మరి జగన్ ఓవైపు.. వైనాట్ 175 అంటుంటే.. కీలకమైన మంత్రి ఇలా సాధ్యమైనన్ని అనడంతో సీమ ప్రాంతంలో మంత్రి అనుచరులు కూడా ఇదే పాట పాడుతున్నారు. దీనిని బట్టి జగన్ చెబుతున్న వైనాట్ 175 సాధ్యం కాదని.. మంత్రివర్గంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే సందేహాలు వస్తున్నాయి. పైకి జగన్ చెప్పినా.. మంత్రులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకుని ఇలా నిర్ణయానికి వచ్చారా? అనే చర్చ సాగుతోంది.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిని గమనించినా.. టీడీపీకి కంచుకోటలుగా కనీసంలో కనీసం 50 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీ అదికారంలోకి వస్తుందా రాదా? అనేది పక్కనపెడితే.. ఈ నియోజకవర్గల్లో వ్యక్తుల బలం ఎక్కువగా ఉంది.
ఇక, సింపతీ కూడా తోడైతే.. ఈ 50 నియోజవకర్గాల్లో అయినా టీడీపీ గెలిచి తీరుతుందని వైసీపీ మంత్రులు లెక్కులు వేసుకుంటున్నట్టు ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. అందుకే వారు వైనాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టారనే చర్చ వస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.