ఆయన మంచి మాటకారి. పైగా చలోక్తులలో ఆయనను మించిన వారు లేరు. ఆయనే శ్రీకాకుళం జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడితే ఎన్నో అర్ధాలు పరమార్ధాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మార్క్ రాజకీయం కూడా అందులో ఉంటుంది. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూసిన ప్రసాదరావు రాజకీయాలు తనకు వద్దు అంటారు. పదవీ వైరాగ్యం చూపిస్తారు. పదవి లేనపుడు అయితే అసహనం వ్యక్తం చేస్తారు. కీలక శాఖలు దక్కించుకున్నా తాను అన్నీ చూసేసిన వాడిని అంటారు.
ఇలా చాలా చిత్ర విచిత్రంగా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు. సడెన్ గా మరోసారి కీలకమైన వ్యాఖ్యలే చేశారు. తాజాగా మాట్లాడుతూ తాను గెలిస్తే ఎంత ఓడితే ఎంత అనేశారు. పైగా వైసీపీ అంటే ఎవరికీ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. తాము ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూంటే వాటి మీద కూడా విమర్శలు వస్తే ఏమి చేయగలమని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇలా మాట్లాడిన సీనియర్ మంత్రి వైసీపీకి ఏ ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయో కూడా చెప్పేశారు తాము వ్యాపార వర్గాల మీద ఎలాంటి దాడులు చేయించడంలేదని అయినా ఆ వర్గం ఇపుడు తమకు దూరంగా ఉందని నిజాలు చెప్పేశారు. కాళింగ వైశ్యులను బీసీలలో కలిపేందుకు తాను ప్రయత్నం చేసి సాధించామని అయినా ఇపుడు ఆ వర్గం వారు తమకు మేలు చేసిన వారికే నష్టం కలిగిస్తోందని నిందలు వేశారు.
దీని కంటే ముందు ఈ మధ్యనే ధర్మాన ప్రసాదరావు మరో సభలో వైసీపీ చేసేవి సంస్కరణలు అని వాటి ఫలితాలు రావడానికి కొంత టైం పడుతుందని అన్నారు. అప్పటిదాకా ఎవరికీ అర్ధం కూడా కాదని అన్నారు. ఇపుడు ఆయన మరో మాట అంటున్నారు తాము అవినీతి లేని పాలన అందిస్తున్నామని, లంచాలు లేని వ్యవస్థను తెచ్చామని, దేశంలో విద్యావిధానం దారుణంగా ఉందని ఏపీలో తమ ప్రభుత్వం అద్భుతంగా ఆ రంగాన్ని తీర్చిదిద్దిందని అన్నారు.
ఇవన్నీ నిజాలు కావా ప్రజలు ఆలోచించాలని, గుండే మీద చేతులు వేసుకుని అంతా వాస్తవాలు చెప్పాలని కోరారు. ఇక పేదల గొప్పవారి మధ్య తారతమ్యాలు లేకుండా చేసేదా పాలన అని ఆ తరహా పాలన తమ ప్రభుత్వం చేస్తోందని ఆయన అంటూ అయినా మెచ్చుకునే వారు లేనట్లుగా మాట్లాడారు.
ఇవన్నీ చెప్పిన ధర్మాన తాను గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అంటున్నారు. ఒక వైపు వైసీపీ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలు ఎవరికీ అర్ధం కావడం లేదని చెబుతున్న సీనియర్ మంత్రి తాను ఓడినా ఏంటి అంటున్నారు అంటే గ్రౌండ్ లెవెల్ లో రియాల్టీస్ ఆయనకు అర్ధమవుతున్నాయా అన్నదే చర్చగా ఉంది. ప్రజలకు ఎంత చేస్తున్నా అర్ధం చేసుకోవడం లేదు అంటే దాని భావమేమి ధర్మాన అంటున్నారు.
అంటే తలపండిన సీనియర్లు వైసీపీకి ఇబ్బంది అవుతుందని వచ్చే ఎన్నికలలో హోరాహోరీ పోరు ఉంటుందన్న సత్యాన్ని గుర్తిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా సీనియర్ మంత్రి ఒకరు తాను ఓడితే ఏంటి అంటూ అశుభం పలుకుతున్నారా అని కూడా అంటున్నారు. వై నాట్ 175 అంటూ జగన్ అన్ని సీట్లు గెలుచుకోవాలని చూస్తూంటే ధర్మనా తాను ఓడతాను అని చెబుతున్నారా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా ధర్మనా మాటలకు అర్ధాలు అంత తొందరగా బోధపడవు కాబట్టి విశ్లేషించి చూడాలనే అంటున్నారు.