కర్నూలు జిల్లా గుమ్మనూరులో బయటపడ్డ పేకాట స్థావరం ఇప్పుడు ఏపీ మంత్రికి చిక్కులు తెప్పిస్తోందన్న ప్రచారం సాగుతోంది. కోట్ల రూపాయల లావాదేవీలు.. కాపలాగా మందీ మార్బలం.. వచ్చిపోయే వాహనాలపై నిఘా.. పైగా ఏకంగా ఏపీ మంత్రి నియోజకవర్గంలో .. పైగా ఆయన సొంత గ్రామంలో బయటపడడంతో అందరి వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ పేకాట స్థావరం ఇన్నాళ్లు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఏపీ మంత్రి జయరాం స్వగ్రామం గుమ్మనూరులో తాజాగా పేకాట స్థావరం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఐదు నెలలుగా ఇక్కడ పేకాట నడుస్తోంది. ఇన్నాళ్లు పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చివరకు ఎస్ఈబీ పోలీసులు రంగంలోకి దిగి వెలుగులోకి తెచ్చారు. దీనివెనుక పెద్ద తతంగం ఉందని తేలింది.
అనంతపురం-బళ్లారి జిల్లాలకు సరిహద్దుల్లో కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ఈ గుమ్మనూరులో కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామంలో ఈ దందా జరుగుతోంది. దీంతో పోలీసులు దరిదాపుల్లోకి రాలేదు. ఐదు నెలలుగా ఇక్కడికి జిల్లా వాసులు, కర్ణాటక, అనంతపురం, బల్లారి, చిత్రదుర్గ, సిందనూరు,శిరిగుప్ప, రాయచూర్ నుంచి జూదం ఆడేందుకు వస్తున్నాడు. ప్రతీరోజు ఈ మారుమూల గ్రామంలో 90 వాహనాల్లో ఇక్కడికి వచ్చి జూదం ఆడుతున్నారని స్తానికులు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఎస్ఈబీ పోలీసుల దాడుల్లో ఈ పేకాట స్థావరంలో భారీగా అక్రమ మద్యం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు అనంతపురం, కడప, చిత్తూరు, బెంగళూరు, బళ్లారి, రాయచూరు నుంచి కూడా భారీ సంఖ్యలో జూదరులు వచ్చి పేకాట ఆడడాన్ని గమనించిన పోలీసులు నిఘా పెట్టి మఫ్టీలో అక్కడికి వెళ్లి రహస్యంగా విచారించారు. పోలీసులను కనిపెట్టి జూదరులు దాడి చేసి కారం చల్లి.. సెల్ ఫోన్లు లాక్కున్నారు. వారు వెళ్లిన ఆటోను ధ్వంసం చేశారు. ఇక్కడికి ఎవరూ రాకుండా ఇన్ఫార్మర్లను పెట్టుకున్నారు. గ్రామం చుట్టూ 10 మంది దాకా నియమించారు. ఇన్ఫార్మర్లకు 3 వేల నుంచి రూ.5వేల వరకు పేకాట ఆడేందుకు వచ్చే వారు కలిసి ఇవ్వాలన్నది ఒప్పందమట..
ఇక ఈ పేకాట స్థావరంలో వాహనాలను బట్టి చూస్తే బడా వ్యక్తులు ఇందులో ఉన్నారని తెలుస్తోంది. దొరికిన వారంతా వాహనాల డ్రైవర్లేనని సమాచారం. రూ.5.34 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 35 కార్లు, 6 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.
జూదంలో గెలిచిన డబ్బులో నిర్వాహకులకు 30శాతం చెల్లించాలనే నిబంధన ఇక్కడ ఉంది. అధికారుల మామూళ్లకు 10శాతం వసూలు చేస్తారనే ప్రచారం స్థానికంగా ఉంది..
ఇక పేకాట స్తావరం నిర్వహణలో మంత్రి జయరాంకు సన్నిహితుడైన నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అతడితోపాటు ఇద్దరు మంత్రి అనుచరుల్ని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మంత్రి తమ్ముడి పేరు కూడా వినిపిస్తున్నా.. అధికారికంగా పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. వీరంతా క్లబ్ నిర్వహణలో కీలకమని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.
ఈ వ్యవహారాన్ని ఏపీ మంత్రి ఖండించి తనకు సంబంధం లేదని.,. నిందితులను కఠినంగా శిక్షించాలని చెబుతున్నా.. ఆయన గ్రామంలో.. అనుచరులే నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరగడంతో మంత్రి జయరాం చిక్కుల్లో పడ్డట్టు అవుతోందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.