జగన్ పట్టుదల నెరవేరుతోంది. జగన్ సిద్ధాంతాలను మంత్రులు పాటిస్తున్నారు. తాజాగా సెక్రెటేరియట్ లో జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారిందట.. ఇప్పుడు దీనపైనే హాట్ హాట్ చర్చ. జగన్ అవినీతి రహిత పాలనకు భరోసా కల్పిస్తూ ఓ మంత్రి ఏకంగా కోటి రూపాయల లంచాన్ని తిరస్కరించడం.. ఇవ్వజూపిన అధికారిపై విచారణకు ఆదేశించడం ప్రస్తుతం ఏపీ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సదురు మంత్రిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి..
ఏపీ రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిజాయితీకి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.తాజాగా ఆయన సెక్రెటేరియట్ లో విధులు నిర్వహిస్తుండగా ఓ సబ్ రిజిస్ట్రార్ వచ్చాడట.. చుట్టు అధికారులు, నాయకులు ఉన్నా మీతో పర్సనల్ గా మాట్లాడాలని మంత్రి సుభాష్ చంద్రబోస్ ను కోరాడట.. అయితే మంత్రి మాత్రం నాకు పర్సనల్ అంటూ ఏమీ లేవని డైరెక్ట్ విషయం చెప్పండని స్పష్టం చేశాడట.. దీంతో ఉండబట్టలేక మంత్రికి తన ఉద్దేశం చెప్పాడట ఆ సబ్ రిజిస్ట్రార్.
అమరావతి రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఇప్పుడు రియల్ భూమ్ నడుస్తోంది. అందుకే తనకు విజయవాడకు సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ చేస్తే కోటి రూపాయలు లంచంగా ఇస్తాను అని మంత్రికి ఆఫర్ ఇచ్చాడట సదరు సబ్ రిజిస్ట్రార్.
అయితే దీనిపై సీరియస్ అయిన మంత్రి సుభాష్ చంద్రబోస్ ‘‘నువ్వు లంచం నాకే ఇస్తాను అంటున్నావంటే ఎన్ని కోట్లు ఇప్పటికే నొక్కేసి ఉంటావు .. ఈ ప్రభుత్వంలో అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయాలని ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని.. నీ మీద విచారణకి చేపించి గతంలో నువ్వెంత అవినీతి చేశావో త్వరలోనే తేలుస్తాం’ అని హెచ్చరించి పంపించాడట..
ఏకంగా కోటి రూపాయల లంచాన్ని కాలదన్ని మంత్రి సుభాష్ సంచలనం సృష్టించాడు. ఇప్పుడిదే ఏపీ సెక్రెటేరియట్ లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి అవినీతి రహిత పాలనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలానే ప్రతి మంత్రి ఆలోచిస్తే ఏపీలో అవినీతి నిర్మూలన విషయంలో పెద్ద ముందడుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జగన్ పరిచిన బాటలో మిగతా మంత్రులు నడుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.