``ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి.. రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పా రు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు``.. అని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సమయంలోనే మరో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆర్కే రోజా శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. మంత్రి పదవిలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. సీఎంతో పలు అంశాలపై చర్చించారు. ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాకు.. కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అంతేకాదు.. రోజాకు అల్పాహార విందును కూడా ఇచ్చారు. అనంతరం.. ఇరువురు.. ఏపీ, తెలంగాణ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించుకున్నారు. అయితే.. ఒకవైపు కేటీఆర్ వర్సెస్ ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలోనే ఏపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. రోజా.. ఏకంగా కేసీఆర్‌తో భేటీ కావడం ఆసక్తిగా మారింది.
ఇక, మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టకముందు.. ఈ నెల 1 న యాదాద్రిని సందర్శించారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ముడుపు కట్టారు. పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి వైభవాన్ని చూసి ఆమె తన్మయత్వం పొందారు. ఆలయ ప్రాభవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవని.. యాదాద్రి పునర్నిర్మాణానికి కృషి చేసిన సీఎం కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. తిరుమలతో సమానంగా యాదగిరిగుట్టను పునర్నిర్మించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 13న రోజా.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, క్రీడలు, యువజన శాఖల మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మర్యాద పూర్వకంగా.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు.