వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రోజా.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. పర్యాటక శాఖకు అమాత్యురాలిగా ఉన్నారు. అయితే, మాత్రం.. నటనా కౌశలం దాచుకోవాలంటే దాగుతుందా? కళాకారులకు ఉన్న చిన్న వీక్‌నెస్ ఇదే. తోటివరితో పాదం కదిపేస్తారు.. స్టెప్పులు వేసేస్తారు. ఇప్పుడు తాజాగా మంత్రి రోజా కూడా అదే పనిచేశారు.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరుగుతున్న`జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు` కార్యక్రమాలకు మంత్రి రోజా హాజరయ్యారు. వాస్తవానికి ఆమె ఎందుకు వచ్చారంటే.. ఇక్కడ జరుగుతున్న సంబరాలు ఎలా ఉన్నాయి.. లోటుపాట్లేంటి వంటివి చూడడానికి. కానీ, ఆ సమయంలోస్టేజ్‌పై కొందరు యువతులు డాన్స్ చేస్తున్నారు. దీంతో ఇంకేముంది.. ``ఆడమని నన్నడగవలెనా?`` అంటూ.. చక్ మని స్టేజ్ ఎక్కి..యువతతో కలిసి నృత్యం చేశారు.
ఇంకేముంది.. అమాత్యురాలైన రోజా.. స్టెప్ వేస్తే.. ఆహూతులు మాత్రం ఊరుకుంటారా... ఈలలు చప్పట్ల తోమోత మోగించారు. ఆడిటోరియం.. ఒక్కసారిగా ఝల్లుమంది. ఇక, డ్యాన్స్ అనంతరం రోజా మాట్లాడు తూ.. కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో సాంస్కృతిక ఉత్సవాలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడే రోజా.. తాజాగా మాత్రం ఎలాంటి రాజకీయాలు మాట్లాడకపోవడం గమనార్హం.
ఇదిలావుంటే, రెండు సార్లు నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న రోజా.. అప్పట్లో ఓ చానెల్‌లో వచ్చిన జబర్దస్త్‌కు న్యాయనిర్ణేతగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, జగన్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మాత్రం.. ఆ షోకు గుడ్‌బై చెప్పారు. ఇక, మంత్రి పదవిచేపట్టిన తర్వాత అప్పుడప్పుడు ఇలా..స్టేజ్‌లపై స్టెప్పులు వేస్తూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు.