ఆమె ఎస్సీ నాయకురాలు. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. గతంలో టీడీపీలో చురుగ్గా పని చేశారు. ఒక సారి ఆ పార్టీ తరఫున కూడా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఇక, 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో గెలుపు గుర్రం ఎక్కారు. తర్వాత..ఎస్సీ కోటాలో మంత్రి వర్గంలోనూ చో టు దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు అదే మంత్రి బెంజికారు వివాదంలో చిక్కుకున్నారు. ఆమంత్రి వర్యులే.. పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన కొవ్వూరు ఎమ్మెల్యే.. తానేటి వనిత.
ఎన్నికలకు ముందు... తర్వాత.. ఇప్పుడు.. అనే మూడు రీతుల్లో.. ఇక్కడి ప్రజలు ఆమె గురించి చర్చించు కుంటున్నారు. దీనికి కారణం.. గతంలో ఇంటింటికీ తిరిగి.. నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలుసుకు న్న వనితకు.. కేవలం.. స్విఫ్ట్ కారు మాత్రమే ఉండేదని..ఇక్కడి వారుచెబుతున్నారు. ఇక, ఎన్నికల సమయంలో.. అద్దె వాహనాలు వాడుకున్నారని.. అంటున్నారు. సరే.. మంత్రిగా ఆమెకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు ఓకే. కానీ, గత ఏడాది నుంచి కూడా మంత్రి బెంజ్‌కారును దిగడం లేదని.. నియోజకవర్గం ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.
``మంత్రిగారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో.. మాకు తెలుసు. మేం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అప్పట్లో మా సమస్యలు వినేందుకు వెళ్తే.. ఆమే ఎదురొచ్చి.. కనుక్కునేవారు. కానీ, ఇప్పుడు బెంజ్ కారు దిగడం లేదు. మమ్మల్ని కనీసం పట్టించుకోవడం కూడా లేదు. మరి మేం చేసుకున్న పాపం ఏంటో..? మాకు అర్ధం కావడం లేదు`` అని మెజారిటీ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఒక ఆన్‌లైన్ చానెల్ వాళ్లు.. ఇక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
మెజారిటీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో మంత్రి తానేటి వనితకు ఓట్లు వేసిది లేదని.. స్ఫష్టంగా పేరు పెట్టి చెప్పడం గమనార్హం. అంతేకాదు.. నియోజకవర్గంలో కన్నా.. హైదరాబాద్.. విజయవాడల్లోనే మకాం వేసి ఉంటున్నారని.. దీనివల్ల.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. అంతేకాదు.. ఆమె నియోజకవర్గంలో పర్యటించినా.. బెంజ్‌కారులోనే ఉంటున్నారని.. కనీసం కాలు కూడా బయట పెట్టడం లేదని.. చెబుతున్నారు. అదే సమయంలో మంత్రిగారు సంపాదన పైనా కొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి మంత్రి వనితకు.. బెంజికారు భలే తిప్పలు పెడుతోందని అంటున్నారు పరిశీలకులు.