`నాకు విదేశాల్లో డబ్బులున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విదేశాల్లో డబ్బు ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నిరూపించలేకపోతే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా? ``ఇది వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ సింపుల్ గా, సూటిగా విసిరిన సవాల్. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మూడవరోజు బుధవారం కడప జిల్లా వీరపునాయునిపల్లెలో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తూ ఈ చాలెంజ్ చేశారు. తాను పాదయాత్ర ప్రారంభిస్తున్నానని తెలిసి కొంతమంది తెలివిగా ప్యారడైజ్ వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చారని..ఇదే అదనుగా కొన్ని పత్రికలు పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాశాయని, సొంత మీడియాలో ప్రముఖంగా చూపించారని జగన్ చెప్పారు. పాదయాత్రకు కవరేజ్ రాకూడదనే ఇలా తప్పుడు వార్తలు రాశారని...వీరందరికి 15 రోజుల గడువిస్తున్నానని, ఈలోగా తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
జగన్ సూటిగా విసిరిన ఈ సవాల్ పలు వర్గాలను ఆకర్షించింది. ``నిజమే కదా? టీడీపీలో ఉన్న మంత్రులు మొదలుకొని పార్టీ ముఖ్యనేతల వరకు పదేపదే విమర్శలు చేసే బదులు...అదేదే పేపర్లలో ఉన్న వాటిని బయటపెట్టేస్తే...జగన్ దోషిగా నిలబడతారు..టీడీపీకి ప్రతిపక్ష నేత నిజరూపం తెలిపిన గుర్తింపు దక్కుతుంది కదా? `` అని రాజకీయవర్గాలు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ అనుకున్నారు. సహజంగానే జగన్ చాలెంజ్ పై టీడీపీ రియాక్షన్ కోసం ఎదురుచూశారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత - ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడనే పేరున్న మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. కానీ ఆ స్పందన...అధికార పార్టీ నేతల స్థాయిలో లేదని అంటున్నారు.
ఇంతకీ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏమన్నారంటే...అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సవాలు స్వీకరిస్తే మా విలువ పోతుందని చెప్పారు. సీబీఐ, ఈడీ సాక్ష్యాలతో పెట్టిన కేసులో ప్యారడైజ్ లోనూ వచ్చాయని యనమల అన్నారు. ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి జగన్ అన్నారు.
అయితే సమాచారం సేకరించడంలో, సంపాదించడంలో ముందంజలో ఉండే టీడీపీకి తలుచుకుంటే ప్యారడైజ్ పేపర్లలో జగన్ వివరాలు సంపాదించడం పెద్ద విషయమే కాదు. అయినప్పటికీ...టీడీపీ ఇలా సూటిగా స్పందిచకపోవడం గేమ్‌లో మజాను తగ్గించిందని అంటున్నారు.