సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారాలోకేష్

Update: 2020-01-23 05:01 GMT
ఏపీకి 3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లు సందర్భంగా శాసనమండలి రణరంగమైన సంగతి తెలిసిందే.ఈ క్రమం లో వైసీపీ మంత్రులంతా మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టడం.. టీడీపీ ఎమ్మెల్సీలంతా నిరసన తెలుపుతున్న సందర్భం అదీ. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పెద్ద తప్పు చేసేశారు. అసలు అసెంబ్లీ లోనే సెల్ ఫోన్ వాడకం పై నిషేధం ఉంది. కానీ దాన్ని ఉల్లంఘించి ఏకంగా ఈ గొడవలకు సంబంధించిన సన్నివేశాలను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో  వైరల్ కావడం తో టీడీపీ ఇరుకున పడింది.

నారా లోకేష్ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండడంపై వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీరియస్ అయిన షరీఫ్ మందలించడంతో నారా లోకేష్ సెల్ ఫోన్ చిత్రీకరణను విరమించుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించింది. మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరడానికి సిద్ధమైంది.

అయితే టీడీపీ మాత్రం నారా లోకేష్ సెల్ ఫోన్ చిత్రీకరణను సమర్థించుకుంది. వికేంద్రీకరణ బిల్లుపై గందరగోళం సందర్భంగా లైవ్ ప్రసారాలను వైసీపీ ప్రభుత్వం బంద్ చేయడంతో ప్రపంచానికి తెలియాలనే లోకేష్ సెల్ ఫోన్ లో చిత్రీకరించాడని పేర్కొంది. అయితే మొబైల్ ఫోన్ ను మండలి లో వాడడం తో ఈ పరిణామం లోకేష్ ను ఇరుకున పెట్టింది.
Tags:    

Similar News