రాష్ట్రంలో వైసీపీ సర్కారు మంత్రి వర్గాన్ని మార్చుకుంది. సీఎం జగన్ తన 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసు కున్నారు. మొత్తం పాతిక మంది మంత్రుల్లో 14 మంది పాత వారిని పక్కన పెట్టి.. మరో 14 మందితో కొత్తవారి ని కేబినెట్‌లోకి తీసుకుని జగన్ 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఈ కొత్త మంత్రుల్లో కొంద రు కేవలం పదవులు తీసుకుని ముచ్చటగా మూడు రోజులు కూడా గడవకముందే.. తీవ్ర వివాదాస్ప దం అయ్యారు. దీంతో సీఎం జగన్ సహా వైసీపీ హైకమాండ్ తలపట్టుకుంది. ఇదేంటి..ఈ మంత్రులు పరువు తీస్తున్నారు? అని సీఎం జగన్ అనుకునే పరిస్థితి వచ్చింది.
విషయంలోకి వెళ్తే.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన.. మంత్రుల్లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మె ల్యే.. ఉషశ్రీచరణ్, తాడేపల్లి గూడెంకుచెందిన.. కొట్టు సత్యనారాయణ, నెల్లూరుకు చెందిన సర్వేపల్లి ఎమ్మె ల్యే కం మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లాకుచెందిన ధర్మాన ప్రసాదరావు, రామచంద్రపు రం ఎమ్మెల్యే కం.. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణలు.. తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ఈ పరిస్థితి పై ప్రజల్లో చర్చ జరగడంతోపాటు.. వైసీపీపైనా.. ప్రబుత్వంపైనా.. తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.
ఉషశ్రీ చరణ్: అనంతపురంలో కొత్త మంత్రిగా అడుగు పపెట్టిన ఉషశ్రీచరణ్‌కు.. పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై.. ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలోనే తన కుమార్తెను ఆసుపత్రికి తరలించలేక పోయానని.. ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతోపాటు.. టీడీపీ నాయకులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నా రు. అయినప్పటికీ.. మంత్రి మాత్రం స్పందించలేదు. కొత్తగా ఏం సాధించినందుకు.. ర్యాలీ నిర్వహిం చారు? అనే ప్రశ్నకు సమాధానం లేకపోవడం గమనార్హం.
ధర్మాన: . తాజాగా మంత్రి పదవిని చేపట్టిన ధర్మాన ప్రసాదరావుకు.. శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున సన్మానం చేశారు. ఈ క్రమంలో ఆయన రెవిన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, అవినీతి లేని విధంగా పాలన అందిద్దామని.. చేసిన ప్రకటన రాజకీయంగా ప్రభుత్వానికి.. పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. రాజకీయంగా చూస్తే రెవెన్యూ శాఖను అప్పటి వరకూ నిర్వహించింది తన అన్న ధర్మాన కృష్ణదాసే. అంటే.. అన్నపైనే తమ్ముడు ప్రసాదరావు తీవ్ర ఆరోపణలు చేశారన్నమాట. ఈ విషయంలో కృష్ణదాసు గుర్రుగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఆగ్రహం ఆవేదన రెండూ వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇదే సభలో వైసీపీ కార్యకర్తపై ఆయన చేయి చేసుకున్నారు.
కొట్టు : దేవదాయ శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తి దేవాల యంలో చూపిన అత్యుత్సాహంతో పదుల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోనే స్పృహతప్పి పడిపోయారు. అప్పటికే మూడు నుంచి నాలుగు గంటల పాటు క్యూలైన్లలో ఉన్న భక్తులను నిలిపివేసి.. మంత్రి తొలి దర్శనం చేసుకున్నారు. దీంతో భక్తులు ఆయనను `గో బ్యాక్` అంటూ.. వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. ఈ మంత్రి పర్యటన వివాదం అయింది.
చెల్లుబోయిన: జగన్ 2.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ``మీడియా మిత్రులకు నా మనవి ఏంటంటే.. సీఎం జగన్ గారి గురించి లోపాలు వెతకం మానేయండి. ఆయనను ఆరాధించండి. ఆయనను ఆరాతీయడం..ఆయన ఏం చేస్తు న్నారో.. తెలుసుకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మీరు ఆరాధించడం ప్రారంభిస్తే.. మీకు అన్నీ మంచే జరుగుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇళ్లు సాకారం కావాలంటే.. ఆరా తీయడం మానేసి ఆరాధించండి. వెంటనే జరిగిపోతాయో లేదో చూడండి`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
కాకాని: నెల్లూరు వైసీపీలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తాజా మాజీ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ల మధ్య వివాదం రేగింది. బలప్రదర్శనకు దిగారు. మంత్రి తనకు ఎంత గౌరవం ఇచ్చారో.. దానికి రెట్టింపు..గౌరవం ఇస్తామని.. అనిల్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే... ఆయన మంత్రి అయిన తర్వాత.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకానిపై దాఖలు చేసిన కేసులో పత్రాలు చోరీకి గురయ్యాయి. ఈ పరిణామం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇలా.. ఈ మంత్రులు.. తీవ్ర వివాదాల్లో చిక్కుకోవడంతో.. అధిష్టానానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.