ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అంటే ఉద్యోగ సంఘాల్లో తిరుగులేని నాయకుడనే పేరుంది.. ఈ బలంతోనే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే... మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన హవా తగ్గుతున్నట్లుగా ఉంది.. తాజాగా ఆయన వ్యతిరేక వర్గం బలపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన పైన పలువురు ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పలువురు ఏపీ ఎన్జీవో ఉద్యోగులు ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం కలిశారు. హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్ ను అమ్మాలని అశోక్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారని వారు జగన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే, ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ఎన్జీవో భవన్ ను అశోక్ బాబు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణ అన్నివర్గాల్లో సంచలనంగా మారడం ఒక విషయమైతే.. ఆ ఆరోపణ చేస్తున్నవారు జగన్ ను ఆశ్రయించడం ఇంకా చర్చనీయాంశమవుతోంది. రాజకీయ కారణాలతో అశోక్ బాబు పై కుట్ర జరుగుతోందా... లేదంటే అశోక్ బాబు పై ఆరోపణలు నిజమేనా అని తేలాల్సి ఉంది. అయితే... ఏది ఏమైనా అశోక్ బాబు ప్రభ తగ్గుతోందన్నది మాత్ర స్పష్టమవుతోంది.