విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తమ తమ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు అసంతృప్తికి గురి కాకుండా ఉండేందుకు అవసరమైతే.. రాష్ట్రం మీద కాస్త భారం పడినా పట్టించుకోకుండా వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఇదే సమయంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా.. తమకున్న సమస్యల్ని పక్కన పెట్టేసి.. ప్రభుత్వానికి ఇబ్బంది కలగని రీతిలో వారూ వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు.. ఆందోళనల్ని తగ్గించి.. ప్రభుత్వానికి తమ కారణంగా అనవసరమైన సమస్యలు వచ్చేలా అస్సలు చేయటం లేదు. అలాంటిది మూడేళ్ల కాలంలో మొదటిసారి ఏపీ ముఖ్యమంత్రి తీరును తప్పు పడుతూ.. ఏపీ ఎన్జీవోల సంఘాలు నిరసన గళాన్ని విప్పాయి.
విజయవాడలోని ధర్నా చౌక్ లో తొలిసారి.. తమ సమస్యలపై గళం విప్పాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్దీకరణ.. ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలన్న డిమాండ్లను వినిపించారు. అంతేకాదు.. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనను నిర్వహించాయి.
ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఈ ధర్నాలో పాల్గొనటం గమానార్హం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. విభజన నేపథ్యంలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూనే.. విజయవాడకు వచ్చారని.. అయినప్పటికీ వారి సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు.
తమ సమస్యల విషయంపై ప్రభుత్వం స్పందించాలని.. పరిష్కారాన్ని చూపుతూ సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లలో తొలిసారి ధర్నాకు దిగాల్సి వచ్చిందన్న అశోక్ బాబు.. తమకున్న సమస్యల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఉద్యోగులు వచ్చినప్పటికీ.. వారి ప్రయోజనాల్ని నెరవేర్చే విషయంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తికి గురి కాకూడదని జాగ్రత్త పడుతున్న చంద్రబాబు.. నిరసన వరకూ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చినట్లు? బాబు మైండ్ సెట్ లో ఏమైనా మార్పు వచ్చిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/