ఏపీలో సంక్రాంతి.. క్రిస్మస్, రంజాన్.. పండుగలకు ఒక ప్రత్యకత ఉంది. ఈ మూడు పండుగలకు.. గత టీడీపీ హయాంలో ప్రజలకు కానుకలు ఇచ్చేవారు. మధ్యలో ఎన్నికలకు ముందు కానుకలతోపాటు మహిళలకు చీరలు కూడా పంచారు.
పేదల రేషన్ కార్డులకు సంక్రాంతి సమయంలో కిలో గోధుమ పిండి, కిలో బెల్లం, 200 గ్రాముల నెయ్యి, కిలో పంచదార వంటివాటిని.. ఉచితంగా ఒక ప్రత్యేక బ్యాగులో పెట్టి ఇచ్చేవారు.
ఇక, క్రిస్మస్ సమయానికి కూడా.. కొన్ని చిన్నపాటి మార్పులతో కిస్మస్ కానుకలను అందించారు. అదేసమ యంలో రంజాన్‌కు కూడా కానుకలు ఇచ్చారు. అయితే.. గోధుమ పిండి స్థానంలో సేమ్యాను ఇచ్చేవారు. మిగిలినవి కామన్. ఎన్నికలకు ముందు.. అన్ని వర్గాల మహిళలకుచీరలు ఇచ్చారు. దీంతో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ అనగానే ఏపీలో ఒక విధమైన సందడి వాతావరణం కనిపించేది.
అయితే.. ఇప్పుడు వీటిని ఎత్తేసి మూడేళ్లు అయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వీటిని ఎత్తేసింది. ఎందకంటే..ఇవ్వడం ఇష్టంలేకకాదు..రాజకీయంగా.. చంద్రబాబు పేరు వినిపించకూడదనే ఉద్దేశమే. కానీ, ప్రజలు మాత్రం అప్పటి కానుకలను గుర్తుంచుకున్నట్టున్నారు. వారుమరిచిపోలేదు. దీంతో తాజాగా శనివారం.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ఎమ్మెల్యేలకు.. ఈ కానుకల సెగ తగిలింది.
ఎక్కువ మంది.. క్రిస్మస్ వచ్చింది కానులివ్వరా? అని ప్రశ్నించారు. దీనికి కొందరు ఎమ్మెల్యేలు.. నవ్వుతూ వెళ్లిపోగా.. ఇప్పటికే సీఎం జగన్ చాలా ఇచ్చారు. ఇవి ఎంత? అని ఎదురు దాడిచేయగా.. మరికొందరు ఇదేమన్నా.. టీడీపీ ప్రభుత్వమా? అని ఎదురుతిరిగి మాట్లాడారు.
ఇలా.. సీమలో ఎక్కువగా కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వినిపించింది. దీనిని బట్టి వైసీపీ నాయకులకు అర్ధమైంది ఏంటంటే.. తాము ఎంతగా చంద్రబాబు ను మరిచిపోవాలని కోరుకున్నా.. ప్రజలు ఆయనను మరిచిపోలేక పోతున్నారేనని!!