ఏ రాజకీయ పార్టీకైనా.. సానుభూతి ముఖ్యం. అధికారంలో ఉంటే.. సంక్షేమ పథకాలు, ఇతరత్రా హామీల అమలు వంటివాటిని ప్రజలు గమనిస్తారు. దీనిని బట్టి సదరు పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. అయితే.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మాత్రం కచ్చితంగా సెంటిమెంటు చాలా ముఖ్యం. ఎక్కడ కూడా దీనిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే, అధికార పక్షం మాత్రం అభివృద్ధిని చూపించే ఓట్లు అడగాలి. ఇది రాజకీయాల్లో ఉన్న మౌలిక సూత్రం.
ఇక, ఇప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెబుతున్నారు. మరి ఈయన ఏ ప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్తారు. సెంటిమెంటుతోనా.. లేక పథకా లతోనా? అనేది ఆసక్తిగా మారింది.
గత ఎన్నికల్లో వైసీపీ అధినేతను తీసుకుంటే..ఆయన సెంటిమెంటు+ పథకాలను కూడా మిక్స్ చేసి రాజకీయాలు చేశారు. తాను అధికారంలోకి వస్తే.. ఈ పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అదేసమయంలో ఆయన చేసిన పాదయాత్ర..ఒక్కఛాన్స్ అంటూ చేసిన ప్రకటన ఫలితాన్ని ఇచ్చాయి.
మరి పవన్ ఏం చేస్తారు? సెంటిమెంటునుఎలా తీసుకువస్తారు? సంక్షేమాన్ని ఏమని ప్రకటిస్తారు? అనేది ప్రశ్నగా మారింది. తన మాటలు చేతల్లో ఇటీవల కాలంలో పవన్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. వైసీపీ నేతలపై తిరగబడాలని.. కొట్టాలని, కాలర్ పట్టుకోవాలని కూడా ఆయన పిలుపునిస్తున్నారు.
కానీ, కొన్నాళ్ల కిందట మాత్రం .. ఏం చేస్తాం.. 2024 వరకు భరిస్తాం. అప్పుడు చూసుకుంటాం.. అని చెప్పారు. ఈ రెండు ప్రకటనలు చూస్తే. గతంలో చేసిన ప్రకటన విషయం ప్రజల్లో నిన్న మొన్నటి వరకు ఉంది.
కానీ, ఇప్పుడు పవన్ చేసిన ప్రకటన ప్రజల్లో చర్చకు రాలేదు. పైగా కారుపై పడుకుని వెళ్లడం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడడం వంటివి పవన్‌కు పెద్దగా మైలేజీ ఇవ్వడం లేదు. ఇక, పథకాల విషయానికి వస్తే.. ఆయన ఏం చేస్తారో రెండు మాత్రమే చెప్పాలి. సుగాలి ప్రీతి ఫైల్ పై తొలి సంతకం, ఉద్యోగుల సీపీఎస్ రద్దుపై రెండో సంతకం చేస్తానన్నారు. అయితే.. మిగిలిన వర్గాల మాటేంటి? అనేది పవన్ ప్రస్తావించలేదు. దీంతో పవన్ ఎలా ముందుకు సాగుతాడు? అనేది చర్చగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.