పోలవరం ఆంధ్రుల జీవనాడి. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే ఆంధ్రా అన్న పూర్ణ అవుతుంది. అటు సాగు నీరు, ఇటు తాగు నీరుతో పాటు పరిశ్రమలకు అవసరం అయిన విద్యుత్ తయారు చేసుకునే వీలు కలుగుతుంది. బహుళాధక సాధక ప్రాజెక్టుగా పోలవరాన్ని రూపకల్పన చేశారు.
అయితే ఇపుడు పోలవరం అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. అదేంటి అంటే డయాఫ్రమ్ వాల్ దారుణంగా దెబ్బ తింది. ఇది ఏకంగా 1.7 కిలోమీటర్ల మేర ద్వంసం అయింది. ఎందుకు ఇలా జరిగింది ఏంటి అన్నది పక్కన పెడితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కాకుండా పోలవరం ప్రాజెక్ట్ ఊసు అన్నది లేదు. ఇది పూర్తి చేసి తీరాల్సిందే.
అయితే ఇలా దారుణంగా దెబ్బ తిన్న డయాఫ్రమ్ వాల్ ని మరమ్మతులు చేసి దారికి తెస్త సరిపోతుందా లేక మొదటి నుంచి మొత్తం పునర్ నిర్మాణం చేయాలా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ లో దెబ్బ తిన్న డయాఫ్రమ్ వాల్ ని కేంద్ర జలశక్తి శాఖ అధికారుల బృందం పరిశీలించింది. వారి అధ్యయనంలో ఏమి తేల్చారో తెలియదు కానీ దెబ్బ తిన్న డయాఫ్రమ్ వాల్ అయితే పోలవరానికి ప్రధాన అడ్డకి అన్నది మాత్రం రూఢీ అవుతోంది.
ఇంకో వైపు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈ డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుని కానీ పునర్ నిర్మాణం కానీ చేయకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేసే చాన్సే లేదు. మరి మరమ్మతులకే ఏకంగా రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద బడ్జెట్.
అంటే మరమ్మత్తుల వద్దనే ఆగినేనే ఇంత ఖర్చు. అదే డయాఫ్రమ్ వాల్ ని పూర్తిగా తిరిగి నిర్మించాలి అనుకుంటే కనుక కచ్చితంగా ఇంతకు మరింత భారీ ఖర్చు అవుతుంది. మరి అదే కనుక జరిగితే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు అన్నది కూడా ఇక్కడ ప్రశ్న. ఇక పోలవరం విషయంలో ప్రతీ అణువూ చూసి మరీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఆనక తాపీగా కేంద్రం పైసలు ఇస్తోంది.
ఇక సవరించిన అంచనా నిధులుగా 55 వేల కోట్లను చెప్పి 48 వేల కోట్లకు అయినా కట్టుబడాలని ఇప్పటికి మూడేళ్ళుగా రాష్ట్రం కోరుతున్నా పట్టింపు లేదు, ఇంకో వైపు అన్నీ కలిపి ఇరవై వేల కోట్ల దగ్గరే కేంద్రం లెక్కలు ఆగిపోయాయి. అందులో విడతల వారీగా ఈ ఎనిమిదేళ్ల కాలంలో 11 వేల కోట్లు చెల్లించేశాం కాబట్టి ఇక మిగిలిన దాన్ని విడతల వారీగా చెల్లిస్తే తమ పని అయిపోతుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు.
మరి ఇంతలో డయాఫ్రమ్ వాల్ విషయంలో చిక్కులు వచ్చి పడ్డాయి. దానికి జలశక్తి వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్న మాట ఏంటి అంటే గత టీడీపీ సర్కార్ రెండు కాఫర్ డ్యామ్ లను ముందు నిర్మించకుండా ఫస్ట్ డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడం వల్లనే అది వరదలకు పూరిగా దెబ్బ తిన్నది అని అంటున్నారు. ఇది చారిత్రక తప్పిదమని కూడా అంబటి చెబుతున్నారు.
అది సరే అనుకున్నా 2019 ఆగస్ట్ లో వచ్చిన వరదలకు డయా ఫ్రమ్ వాల్ దెబ్బ తింటే అప్పటి జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు దాని గురించి చెప్పలేదు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. మరి మూడేళ్ల కాలం పూర్తి అయిపోయాయి. మిగిలింది రెండేళ్ళు. ఇపుడు డయాఫ్రమ్ వాల్ దగ్గరే కధ ఉంటే దీనికి నిధులు ఇచ్చి మరమ్మత్తులతోనో లేక పునర్ నిర్మాణమో చేస్తే అసలు ప్రాజెక్టు పూర్తి ఎపుడు అవుతుంది, ఎంతకాలం పడుతుంది అన్న అంచనాలు అయితే ఎవరి దగ్గరా లేదు.
మొత్తానికి అంబటి మినిష్టర్ కావడంతో ఒక విషయం అయితే జనాలకు తెలిసింది. అదేంటి అంటే పోలవరం మీద ఇప్పటికైతే ఆశలు వదిలేసుకోవచ్చు అని, మరి ఎపుడు పూర్తి చేస్తారు అన్నది మాత్రం ఎవరూ అడగకూడని ప్రశ్న అని. సో పోలవరం అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు కానీ దానికి మాత్రం ఎక్కడ లేని శాపాలూ తగులుతున్నాయి.