హైద‌రాబాద్‌ కు ఏపీ పోలీసులు.. న‌లుగురు ముఖ్యుల అరెస్ట్‌

Update: 2018-12-25 09:56 GMT
హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ మావోయిస్టుల‌ క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఇటీవ‌లి కాలంలో ఏపీలో పంజా విసురుతున్న మావోయిస్టుల‌కు సంబంధించిన కీల‌క చ‌ర్యకు హైదాబాద్ వేదిక‌గా నిలిచింది. హైదరాబాద్‌ లో నలుగురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని మౌలాలీ ప్రాంతంలో అనూష- అన్నపూర్ణ- భవానీ- కామేశ్వరరావు లను అరెస్టు చేశారు. వీరు నలుగురూ 2017 ఉంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్లొంటున్నారని పోలీసులు చెప్పారు.

ఏపీలో ఇటీవ‌ల మావోయిస్టుల ప్ర‌భావం పెద్ద ఎత్తున తెర‌మీద‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వ‌ర‌రావు- సివిరె సోమ‌ను మావోలు కాల్చిచంపారు. 'కిడారి- సోమలు ఆస్తులు కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. బాక్సైట్‌ తవ్వకాలకు మద్దతుగా నిలిచిరు. కిడారి- సోమలను శిక్షించే   ముందు గంటసేపు ప్రజా కోర్టు నిర్వహించాం. మావోయిస్టులు ఉనికి కోసమే కాల్పులకు పాల్పడ్డామన్న ఆరోపణల్లో నిజం లేదు. మా పోరాటాలు కొనసాగుతాయి' అని ఆ లేఖలో వివరించారు. 

దీంతో పోలీసులు మావోల ఉనికి పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఈ క్ర‌మంలో విశాఖ నుంచి న‌లుగురు మావోయిస్టులు హైద‌రాబాద్‌ కు చేరుకున్నార‌నే ప‌క్కా స‌మాచారంతో విశాఖ పోలీసులు న‌గ‌రానికి వ‌చ్చి వీరిని అరెస్ట్ చేశారు. పోలీసుల పై దాడి చేసిన 3 ఘటనల్లో వీరి ప్రమేయం ఉందన్నారు. గత ఏడాది అగ్రనేత రామకృష్ణతో కలిసి వీరు పనిచేశారని, మావోయిస్టు పార్టీ బలోపేతానికి పని చేశారని చెప్పారు. అరెస్టయిన వారిలో ఇద్దరు అక్కాచెళ్లెల్లున్నారని తెలిపారు. కాగా ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది.
Tags:    

Similar News