ఒక కారు డ్రైవర్ అడ్రెస్ పట్టుకోవటం అంత కష్టమా? పోలీసులు తలుచుకోవాలే కానీ.. క్షణాల్లో వారికి సంబంధించిన సమాచారం ఇట్టే బయటకు వచ్చేస్తుంది. అందులోకి.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. స్వయంగా రాష్ట్ర మంత్రి అయిన వ్యక్తికి కారు డ్రైవర్ గా.. గన్ మ్యాన్ గా వ్యవహరించే వ్యక్తి అడ్రస్ పట్టుకోవటం ఎంత కష్టమన్నది ఏపీ పోలీసులకు తెలిసి వస్తోంది.
ఒక రాష్ట్ర పోలీసులు.. వేరే రాష్ట్రంలోని పోలీసుల సహకారం లేకపోతే ఎంత ఇబ్బందన్నది ఏపీ సీఐడీ అధికారులకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి టీఏసీబీ నోటీసు ఇవ్వటం (ఇంటికి నోటీసులు అంటించి వెళ్లటం) తెలిసిందే. దీనికి ప్రతిగా అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ గన్ మ్యాన్.. కారు డ్రైవర్ లకు నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించిన ఏపీ సీఐడీకి చుక్కలు కనిపిస్తున్నాయి.
వారి ఆచూకీ కోసం బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం.. కేటీఆర్ నివాసానికి వెళ్లినా ప్రయోజనం లేకపోవటం.. చివరకు తమ వద్దనున్న ఫోన్ల ఆధారంగా కరీంనగర్.. నిజామాబాద్ లలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే.. అక్కడా తాము వెతుకుతున్న వారు లేరని తేలటం ఒకటైతే.. ముత్తయ్యకు బెదిరింపు కాల్స్ వచ్చినవిగా చెబుతున్న ఫోన్ నెంబర్లు ఇప్పుడు పని చేయకపోవటం మరో విశేషం.
ఇక.. అప్పుడెప్పుడో ఒడిశా కాంట్రాక్టర్ ను కిడ్నాప్ చేసి విశాఖ జిల్లా పెందుర్తి ఎస్ ఐ పై హత్యాయత్నం చేసిన కేసులో పాత గన్ మెన్లకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పేర్లు మినహా మరెలాంటి సమాచారం లేకపోవటంతో కరీంనగర్ పోలీసులు నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. కారణాలు ఏమైనా నోటీసులు ఇచ్చే విషయంలో ఏపీ పోలీసులకు దిమ్మ తిరిగిపోతోంది. మరోవైపు లోకేశ్ డ్రైవర్ కు ఇచ్చిన నోటీసులకు.. స్పందన లేని పరిస్థితి. ఏసీబీ చెప్పిన సమయానికి లోకేశ్ డ్రైవర్ రాకపోవటంతో మరోసారి అతనికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.