'రెడ్డి' మీద ప‌దే ప‌దే ఏడ‌వ‌కు..

Update: 2022-05-30 15:30 GMT
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ పూర్వాప‌రాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ పార్టీని స్థాపించిన స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆశ‌యాలు వేరుగా క‌నిపిస్తాయి. కులాల‌కు, మ‌తాల‌కు.. ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. ఆయ‌న తెలుగు వారి ఆత్మ గౌర‌వానికి ప్రాదాన్యం ఇచ్చారు. ఇదే నినాదంతో ఆయ‌న పార్టీని స్థాపించి.. ఊరూ వాడా రాష్ట్రం న‌లుచెర‌గులా ప‌ర్య‌టించి.. పార్టీని బ‌లోపేతం చేసి.. అప్ప‌టి కాంగ్రెస్‌ను మ‌ట్టి క‌రిపించారు. ఆత‌ర్వాత‌.. బీసీల‌కు రాజ్యాధికార్యం క‌ల్పించి.. టీడీపీకి బీసీల‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. పార్టీ ప‌గ్గాలుచేప‌ట్టిన‌.. చంద్ర‌బాబు కూడా..రెడ్ల‌కు ప్రాధాన్యం ఇచ్చి.. వారిని కూడా పార్టీకి చేరువ చేశారు. ఇక‌, వైఎస్ హ‌యాంలోనూ.. బీసీల‌ను, రెడ్ల‌ను, క‌మ్మ‌ల‌ను, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల‌ను స‌మానంగా చూసుకున్నారు. అందుకే ఆయ‌న భారీ పోరులోనూ 2009లో రెండోసారి విజ‌యం ద‌క్కించుకున్నా రు. ఇక‌, చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతోనే టీడీపీ కేడ‌ర్ అంతా కూడా ఆయ‌న‌కు ద‌గ్గ‌రైంది. వీరిలో రెడ్లు కూడా నెమ్మ‌దిగా టీడీపీకి కొంచెం షిఫ్ట్ అయ్యారు. కానీ, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్  త‌న పిల్ల చేష్ట‌ల‌తో టీడీపీకి రెడ్లు దూర‌మ‌య్యేలా చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇదే క‌నుక కొన‌సాగితే.. 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్టే మ‌ళ్లీ వ‌స్తుంద‌ని.. విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా రాయ‌ల‌సీమ రెడ్డి సామాజిక వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.  త‌ప్పు చేసిన రెడ్డిని తిట్టొ చ్చు. కానీ, ప్ర‌తిసారీ.. రెడ్డి.. రెడ్డి .. రెడ్డి అంటూ.. విరుచుకుప‌డ‌డం మానుకోవాల‌ని.. మీడియా మేధావులు సైతం చెబుతున్నారు. రాయ‌ల‌సీమ‌లో రెడ్ల ఆధిప‌త్యం ఎక్కువ‌. అయినా.. కూడా ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో మూడు సీట్ల‌లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అవి కూడా మూడూ క‌మ్మ‌ల‌కే కావ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు(కుప్పం), ప‌య్యావుల కేశ‌వ్‌(ఉర‌వ‌కొండ‌), నంద‌మూరి బాల‌కృష్ణ‌(హిందూపురం). అయితే.. ఇప్పుడు రెడ్డి కులంలో క‌నుక చిచ్చు పెడితే.. ఆఖ‌రికి లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలిచే ఛాన్స్ ఉండ‌ద‌ని అంటున్నారు.  2014లో టీడీపీ గెలిచిన త‌ర్వాత‌..చంద్ర‌బాబు.. త‌న కుమారుడు.. లోకేష్‌ను మంత్రిని చేయ‌కుండా.. ఉంటే.. ఖ‌చ్చితంగా మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చి ఉండేద‌నే విశ్లేష‌ణ కూడా ఉంది. ఎందుకంటే.. అప్ప‌టికి .. లోకేష్‌కు రాజ‌కీయంగా ఎలాంటి ప‌రిప‌క్వ‌త లేదు.  పైగా ప్ర‌జ‌ల నుంచి కూడా గెలుపుగుర్రం ఎక్క‌లేదు. దొడ్డిదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు.

మ‌రోవైపు పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్ప‌టికీ.. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను .. చంద్ర‌బాబు పార్టీలోకి తీసుకున్నారు. అంతేకాదు.. వారిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అంతేకాదు.. ఆ న‌లుగురితో జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు అసెంబ్లీలోబాగా తిట్టించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన రాయ‌ల సీమ ప్ర‌జ‌లు క‌సి పెంచుకుని.. వైసీపీకి ప‌ట్టం క‌ట్టారు. అదేస‌మ‌యంలో 23 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకు న్న టీడీపీకి అంతే సంఖ్య‌ను మిగిల్చారు.

అంటే.. ఒక్క‌సారి లోకేష్ దీనిని ప‌రిశీలించి.. ఆలోచ‌న చేసుకోవాలని అంటున్నారు. ఇక‌, రెడ్ల డామినేష‌న్ ఎక్కువ‌గ ఉన్న  నెల్లూరు నుంచి టీడీపీ వైపు ఎలాంటి సాను కూల ప‌వ‌నాలు వీయ‌డం లేదు. ప్ర‌కాశం జిల్లాలోని ప‌శ్చిమ‌ప్ర‌కాశంలో టీడీపీకి అభ్య‌ర్థులు కూడా క‌రువ‌య్యారు. ఎందుకంటే.. ఇక్క‌డ రెడ్ల‌దే హ‌వా!  రెడ్లు ఉండే 7.5 శాతం ఓట్లు క‌మ్మ‌ల‌కు ఉండే 6 శాతం ఓట్లుతో పార్టీలు గెల‌వ‌లేవు ... అని లోకేష్ గుర్తుంచు కోవాల‌ని చెబుతున్నారు.

గోదావ‌రి జిల్లాల్లో ఈ సారి ఎవ‌రికైతే.. మెజారిటీ వ‌స్తుందో వాళ్ల‌కే అధికారం అని.. స‌ర్వేలు చెబుతున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ అయినా.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు అయినా.. జ‌గ‌న్ అయినా.. గోదావ‌రి జిల్లాలో మెజారిటీ వ‌చ్చిన వాళ్లే.. సీఎం అయ్యారు అని అంటున్నారు.  కాబ‌ట్టి.. లోకేష్ రెడ్ల మీద ప‌డి ఏడ‌వ‌కుండా.. త‌ప్పు చేసిన వారిని మాత్ర‌మే ఎలివేట్ చేసి.. చీల్చి చెండాడితే.. బాగుంటుంద‌ని.. అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News