ఇపుడు ఏపీలో అందరి చూపూ ఉత్తరాంధ్రా మీదనే ఉంది. అలాగే ఉత్తరాంధ్రాలో రాజకీయం కూడా వేడిగా వాడిగా మారుతోంది. విశాఖ రాజధాని కావాలంటూ మంత్రుల స్థాయిలోనే ఇపుడు డిమాండ్లు వస్తున్నాయి. అవి కాస్తా ముందుకు వెళ్ళి రాజీనామాలకు దారి తీస్తున్నాయి. జగన్ ఓకే అంటే నేను రాజీనమా చేసి ఉద్యమంలో ఉరుకుతాను అని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాన్ని అందిపుచ్చుకుని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తాను రాజీనామా చేయడానికి రెడీ అన్నారు.
ఇక ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అయితే మరో అడుగు ముందుకేసి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి అందరికీ షాక్ తినిపించారు. తాను స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశానని, విశాఖ రాజధాని కోసం ఎందాకైనా పోరాటం చేస్తానని ధర్మశ్రీ ప్రకటించారు. పనిలో పనిగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. అచ్చెన్న రాజీనామా చేస్తే తాను టెక్కలిలో పోటీ చేసి ఆయన్ని ఓడిస్తాను అని బిగ్ సౌండ్ చేశారు.
ఇపుడు రాజధాని రగడకు తోడు డోస్ పెంచేసి రాజీనామాలను కూడా చేస్తూ వైసీపీ నేతలు మూడు రాజధానుల కధను రక్తి కట్టిస్తున్నారు. దీని తోడు అన్నట్లుగా నాన్ పొలిటికల్ జేఏసీని కూడా ఏర్పాటు చేశారు. ఈ జేఏసీ ఉత్తరాంధ్రా జిల్లాలలో కలియతిరుగుతూ ఉద్యమిస్తుందని, గ్రామ స్థాయి వరకూ వికేంద్రీకరణ ఉద్యమాన్ని తీసుకెళ్తుందని నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా అమరావతి రైతుల పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలను దాటుకుని ఉత్తరాంధ్రా వైపుగా రావడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. ఉత్తరాంధ్రాలో పాదయాత్రను అడుగుపెట్టనీయమని ఇప్పటికే వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వంలో ఉంటూ అలా మాట్లాడడం ఇబ్బందులను కలుగచేస్తుంది అన్న ఆలోచనలతోనే నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి తమ మద్దతుతో దాని ద్వారా రాజకీయ యాక్టివిటీని చేయిస్తారు అని అంటున్నారు.
అంటే అమరావతి రైతుల పాదయాత్ర వెనక టీడీపీ మద్దతు ఉందని భావిస్తున్న వైసీపీ దానికి కౌంటర్ గా తమ మద్దతుతో జేఏసీని ఏర్పాటు చేశారని అంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో అమరావతి రైతుల పాదయాత్ర సాఫీగా ఉత్తరాంధ్రాలో సాగుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. నాన్ పొలిటికల్ జేఏసీ కూడా అదే దారిన పడితే అపుడు రెండు వర్గాలు రెండు నినాదాలు వెనక రెండు పార్టీల మద్దతుతో ఉత్తరాంధ్రాలో ఉద్రిక్తతలు కూడా మొదలవుతాయని అనుమానిస్తున్నారు.
మరో వైపు కరణం ధర్మశ్రీ రాజీనామా ప్రకటనతో రాజకీయంగా టీడీపీ మీద వత్తిడి తీసుకురావడానికి చూస్తున్నారు అని అంటున్నారు. మేము రాజీనామాలకు రెడీ మీరు రాజీనామాలు చేస్తారా అని సవాల్ చేయడం ద్వారా ఉత్తరాంధ్రాలో టీడీపీని పొలిటికల్ గా దెబ్బేయడానికి వైసీపీ పక్కా ప్లాన్ తో రెడీ అయింది అంటున్నారు. చూడాలి మరి ఈ రాజధాని రగడ ఎంత దూరం వెళ్తుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.