జ‌గ‌న్ 2.5 ల‌క్ష‌ల కోట్లు పంచుతాడు.. నువ్వు 3 ల‌క్ష‌ల కోట్లు పంచుతావా.. చంద్ర‌బాబూ?!

Update: 2022-05-28 15:38 GMT
రాజ‌కీయాల్లో ఇప్పుడు కావాల్సింది.. మాట‌లు కాదు. ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా.. మాట‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. వారికి ఎవ‌రు డ‌బ్బులు పంచుతున్నారు?  ఎంత పంచుతున్నారు?  ఎప్పుడు పంచుతున్నారు? అనే విష యాల‌నే ప‌రిశీలిస్తున్నారు. అంత‌కుమించి.. వారికి ఏమీ అవ‌స‌రం లేద‌నే సంకేతాలు స్ప‌స్టంగా పంపిస్తు న్నారు. నిజానికి రాజ‌కీయాల్లో ఇప్పుడు సినిమా డైలాగులు చెబితే.. ప‌నులు జ‌రిగిపోవ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి కూడా ఈ ప‌రిణామం క‌నిపిస్తోంది.

అయితే.. త‌ర్వాత‌.. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మ‌రింత‌గా ఈ పంచుళ్ల కార్య‌క్ర‌మం మొద‌లైంది. స‌రే. ఇది మంచిదా.. కాదా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. క‌రోనా త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు ఉపాధి పోవ‌డం తోపాటు.. వేత‌నాలు కూడా ప‌డిపోవ‌డంతో వారికి ప్ర‌భుత్వం నుంచి ఏదో ఒక రూపంలో సాయం అందు తోంది. సో.. ఇప్పుడు వారు ఇలా.. త‌మ‌కుఇచ్చేవారు కావాల‌నే!  కానీ, టీడీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మాత్రం.. ఇంకా సినిమా డైలాగుల‌తో నే కాలక్షేపం చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం టీడీపీ.. కొన్ని నినాదాల‌ను తెర‌మీదికి తెచ్చింది. ``క్విట్ జ‌గ‌న్‌-సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌`` అంటూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని కూడా పిలుపునిచ్చింది. ఇదే స‌మ‌యంలో వైసీపీ రావాలి జాగ‌న్‌.. కావాలి జ‌గ‌న్‌, మ‌ళ్లీ నువ్వేరావాలి..అనే నినాదాలు ప‌లుకుతోంది. మ‌రోవైపు.. ఇంకొక సారి చాన్స్ ఇవ్వండి అని.. అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఇవ‌న్నీ వ‌ర్కువ‌ట్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ఇలాంటి సోది డైలాగుల‌కు ప్ర‌జ‌లు ఫిదా అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

క‌రోనా త‌ర్వాత‌.. జ‌నాల‌కు డ‌బ్బులు కావాలి. ఎప్పుడు అయితే.. డ‌బ్బులు నేరుగా పంచే ఆలోచ‌న వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ కు వ‌చ్చిందో అప్పుడే జ‌నాల మైండ్ సెట్ కూడా మారిపోయింది.  ఈ క్ర‌మంలో నే జ‌గ‌న్ ఎన్ని తిప్ప‌లు ప‌డి అప్పులు చేసినా.. వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. వీటి ద్వారా రూ. 1.37 ల‌క్ష‌ల కోట్ల‌నుపంచారు. అంతేకాదు.. రాబోయే రెండేళ్ల కాలానికి మ‌రో 1.25 ల‌క్ష‌ల కోట్లు పంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

అంటే.. దాదాపు 2.5 ల‌క్ష‌ల పంచుతున్నార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. అంటే.. వాస్త‌వానికి దీనినే సీఎం జ‌గ‌న్‌.. త‌న‌కు ఓట్లు ఇచ్చే సాధ‌నంగా.. మ‌లుచుకోబోతున్నార‌నేది తెలుస్తోంది. నేరుగా.. ఓట్లు సాధించే మిష‌న్లుల లేవు. కానీ, అదే మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డంతో ప్ర‌జ‌లంతా త‌న‌వెంటే ఉంటార‌ని.. ఆయ‌న భావిస్తుండి ఉండాలి. అంటే.. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నినాదం 2.5 ల‌క్ష‌ల కోట్లు పంచాను.. చంద్ర‌బాబు అధికారంలో వ‌స్తే.. అవి ఆగిపోతాయ‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌నున్నారు.

అంతేకాదు.. తాను మ‌ళ్లీ విజ‌యం సాధిస్తే.. 3 ల‌క్ష‌ల కోట్లు పంచుతాన‌ని.. చెప్పే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ నేప‌థ్యంలోఅధికారంలోకి రావాల‌ని అనుకుంటున్న చంద్ర‌బాబు కూడా.. ``నేను కూడా 3 ల‌క్ష‌ల కోట్లు పంచుతాను`` అంటే.. జ‌నాలు ఆలోచ‌న చేస్తార‌ని అంటున్నారు. కానీ, బాబు మాత్రం ఏమీ స‌మాధానం చెప్ప‌డంలేదు. పైగా.. తాను డెవ‌ల‌ప్ మెంట్ చేస్తాన‌ని.. అన్నా క్యాంటీన్ల‌ను తిరిగి తెస్తాన‌ని.. రంజాన్ తోఫా,క్రిస్మ‌స్ కానుక‌ల‌ను అందిస్తాన‌ని.. ఇలా.. పాత డైలాగుల‌కే.. ప్రాధాన్యం ఇస్తున్నారు.

కానీ ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితి నేప‌థ్యంలో ఆయా ప‌థ‌కాల‌కంటే.. కూడా.. వ్య‌క్తిగత సంక్షేమం కోస‌మే ప్రాధాన్యం ఇస్తున్నారు.  మ‌రీ ముఖ్యంగా డ‌బ్బులే కావాలి. ఎందుకంటే.. భ‌ర్త మందు కోసం.. డ‌బ్బులు కావాలి.. పుత్ర ర‌త్నం.. ఫోన్ కోసం.. మ‌నీ కావాలి. ఎల‌క్ట్రిక్ బైక్ కావాలంటే.. మ‌నీ కావాలి. ఇలా చెప్పుకొంటూ.. పోతేచాలానే  ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ద్య పంచుడు వ్య‌వ‌హార‌మే రేపు ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో నువ్వు ఎంత పంచుతావ్‌.. నేను ఎంత పంచుతాననేదే త‌ప్ప‌.. మ‌రొక మాటేలేద‌ని అంట‌న్నారు.
Tags:    

Similar News