జగమంత కుటుంబం నాది అంటూ సినీ కవి ఒక పాట రాశారు. ఇక మహాకవి శ్రీశ్రీని చూస్తే ప్రపంచ బాధ అంతా అయనదే. రాజకీయాలోకి దీన్ని అన్వయించుకుంటే వర్తమానంలో టీడీపీ అధినాయకుడు చంద్రబాబు బాధ జగమంత బాధ. ఆయన బాధనే ప్రపంచం బాధగా భావిస్తున్నారు. చెబుతున్నారు. ఆయనలా గుక్కబట్టి జనాలను కూడా ఏడవమంటారు. ఆయన కళ్ళతో చూడాలని, మెదడుతో ఆలోచించాలని బాబు గారు తెగ తపన పడుతూంటారు.
కానీ అది జరిగే పనేనా. ఎవరికి ఏడుపు వస్తే వారు ఏడుస్తారు. ఎవరికి నొప్పి పుడితే వారు అమ్మా అని అరుస్తారు. కానీ చంద్రబాబు జిల్లా యాత్రలు చేసినా బాదుడే బాదుడు అంటూ ప్రోగ్రాం టేకప్ చేసినా ఒకటే స్పీచ్, రొడ్డ కొట్టుడు రొటీస్ స్పీచ్ తో మా బుర్రలు తినేస్తున్నారు అని ఎవరైనా అనుకుంటే తప్పేముంది. తమ్ముళ్లకు అయితే తప్పేదేముంది అనుకోవచ్చు. కానీ ఒంగోలు మహానాడులో మాట్లాడినా చోడవరం మినీ మహానాడులో స్పీచ్ దంచికొట్టినా తేడా ఏమైనా ఉందా అంటే లేనే లేదు.
అర్జంటుగా జగన్ దిగిపోవాలి టీడీపీ గద్దెనెక్కాలి. ఏపీ ముప్పయ్యేళ్ళు వెనక్కిపోయింది. అభివృద్ధి లేదు, మరోటీ లేదు ఇదే రకమైన మాటలతోనే బాబు జిల్లా టూర్లు సాగుతున్నాయి. కొత్త విషయాలు కానీ కొత్తదనం కానీ లేకపోవడమే విశేషం. ఇక మహానాడులో పార్టీ విధానలను నిజానికి చర్చించాలి. తాము ఏం చేశామన్నది సమీక్ష చేసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఆత్మ స్తుతి పరనిందతోనే మహానాడు సాగిపోయింది అని ఆరోపణలు వినిపించాయి.
ఇక ఇపుడు చూస్తే చోడవరంలో జరిగిన మినీ మహానాడు జిల్లాకు ఒకటి పెట్టి మరీ చంద్రబాబు అధికార పార్టీ మీద సవాల్ చేస్తున్నారు. ఈ మినీ మహానాడులో అయినా పార్టీ చేసిన మంచి గురించి చెబుతున్నారా లేక వచ్చే ఎన్నికల్లో తాము ఏం చేయబోతున్నామన్నది అయినా వివరిస్తున్నారా అంటే అదేమీ లేదు. బాబు నుంచి దిగువ స్థాయి నాయకుల వరకూ అంతా మైకు చూడగానే పూనకాలు వచ్చినట్లుగా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు.
ప్రతిపక్షానికి ఆ హక్కు ఎపుడూ ఉంటుంది. అధికార పార్టీ మీద విరుచుకుపడాల్సిందే. కానీ సమయం సందర్భం లేకుండా నిరంతరం విమర్శలే పనిగా పెట్టుకుంటే జనాలకు ఎక్కుతుందా అన్నదే ఇక్కడా పాయింట్. అంతే కాదు జనాలు ఏ మేరకు కనెక్ట్ అవుతారు అన్నది కూడా చూడాలి.
ఇక చంద్రబాబు తీరు చూస్తే జగన్ని అర్జంటుగా గద్దె దించేయాలని ఉంది. ఇలాంటి సీఎం ఒక క్షణం కూడా పవర్ లో ఉండదానికి వీలు లేదు అని బాబు గద్దిస్తున్నారు. కానీ జగన్ కి ప్రజలు అధికారం ఇచ్చారు. ఆయనను అయిదేళ్ల పాటు సీఎం గా ఎన్నుకున్నారు. ఆ టెర్మ్ అవకుండానే దిగిపో అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అన్నది కూడా ఆలోచించాలి కదా. అంతే కాదు ఎంత వేగంగా తాము అధికారం చేపడతామా అన్న అధికార దాహం కూడా కనిపించి బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు.
మరోవైపు చంద్రబాబు అయితే తాను నవ యువకుడిని అని చెప్పుకుంటున్నారు. నేను మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నాను అని కూడా చెబుతున్నారు. అది ఇపుడు అవసరమా అన్నది కూడా ఆయన ఆలోచిస్తున్నారా అంటే జవాబు లేదు. ఎవరు అడిగారు రాజకీయ నాయకుల వయసులు. వారికి ఓపిక ఉన్నంతవరకూ పాలిటిక్స్ లో ఉండవచ్చు. ఆ విషయంలో జనాలే మంచి తీర్పరులు. నేను మొనగాడిని అని చెప్పుకున్నా నచ్చకపోతే పక్కన పెడతారు. నచ్చితే ఎనిమిది పదుల వయసు ఉన్నా కూడా అధికార పీఠాలు అప్పగిస్తారు.
అందువల్ల ఈ తరహా ఆత్మస్తుతి మాటలు తగ్గించుకోవాలి కదా. ఇక బొబ్బిలి పులిని అవుతాను, సింఘలా గర్జిస్తాను అన్న సినీ డైలాగులు వల్ల ఉపయోగమేదైనా ఉందా అన్నది చూడాలి. అలాగే, వైసీపీ వారికి తగిన శాస్తి చేస్తామని చంద్రబాబు చేసే భారీ ప్రకటనలు తమ్ముళ్లకు ఆనందంగా ఉంటే ఉండవచ్చు కానీ సాదర జనాలకు మాత్రం అవి మెప్పించలేవని గ్రహించాలి.
మొత్తానికి చూస్తే ఏడాది పాటు వంద అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతాను అని బాబు అంటున్నారు. ఇదే రకమైన స్పీచులతో ఆయన ఊరూరా తిరిగితే పార్టీకి అది ఎంతమేరకు మేలు చేస్తుందో చూడాలి. జనాలను అట్రాక్ట్ చేసేలా స్పీచులు ఉండడమే కాదు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని అర్ధమయ్యేలా చెబితేనే ఈ యాత్రలకు సార్ధకత అని అంటున్నారు.