తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి సమీపంలో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పట్టణ శివారులోని జాతీయ రహదారి పక్కన ఆత్మకూరు పంచాయతీ పరిధిలో సుమారు 4.5 ఎకరాల భూమిని ఇందుకోసం ఎంపిక చేశారు. దసరాకు కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ - రాష్ట్ర పరిపాలనకు అందుబాటలో ఉండే విధంగా మంగళగిరి వద్ద ఈ స్థలం ఎంపిక చేశారు. గతంలో వాగు పోరంబోకుగా ఉండే ఈ స్థలం ప్రస్తుతం భౌగోళిక - నైసర్గిక స్వరూపాలు మారి పోవటంతో వాగు వచ్చే పరిస్థితులు లేవు. గతంలో కొందరు భూమిని స్వాధీనం చేసుకోటానికి విఫలయత్నం చేశారు.అయితే ప్రభుత్వం వారి ప్రయత్నాలను అడ్డుకుంది. తాజా పరిస్థితిని నీటి పారుదలశాఖ జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెదేపా కార్యాలయానికి సాంకేతికపరంగా ఎలాంటి అవరోధాలు లేవని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి పక్కన రాజధాని అమరావతి పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ తెదేపా కార్యాలయం ఏర్పాటు చేస్తే గుంటూరు - కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల నాయకులకు అందుబాటులో ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా ముఖ్యమంత్రి - తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాసం ఉండవల్లిలో ఉంది. రాష్ట్ర పరిపాలన క్యాంపు కార్యాలయం విజయవాడలో ఉంది. ఈరెండింటికి పార్టీ కార్యాలయం కేవలం 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరోవైపు రాజధాని అమరావతి - వెలగపూడి సచివాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో పార్టీ కార్యాలయం ఉంటుంది. అన్నింటి కంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు 6వ బెటాలియన్ కార్యాలయం వెనుకనే ఉంది. మరో వైపు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కార్యాలయం నిర్మాణంలో ఉంది. అన్ని విధాలా రక్షణకు ఇది అనువైనదిగా భావించిన పార్టీ అధినేత చంద్రబాబు జాతీ పార్టీ కార్యాలయం మంగళగిరి సమీపంలోనే నిర్మించేందుకు మొగ్గు చూపారు. త్వరలో నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు.