సోలోగానే సైకిల్ ఫైట్ : భారీ మెజారిటీలు రాకపోవచ్చు...గెలుపు గ్యారంటీ...?
ఏపీలో సైకిల్ జోరు పెరుగుతోంది. నమ్మకం కూడా ఎక్కువ అవుతోంది. నిన్నటిదాకా ఉన్న నిరాశ పోయి ఇపుడు నిబ్బరం వచ్చి చేరింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం తమకు దక్కడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలు బాగా విశ్వసిస్తున్నారు. ఇంతకాలం అందరూ కలవాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని అన్న వారే ఇపుడు ఎవరు కలసి వచ్చినా రాకపోయినా సింగిల్ హ్యాండ్ తో తాము వైసీపీని పడగొడతామని చెబుతున్నారు.
ఇదంతా ఎందుకు అంటే జనసేన అధికారంలో వాటా కోరడం వల్ల వచ్చిన మార్పు. ఈసారి తగ్గేదే లేదు, మాకూ తగిన ప్రయారిటీ ఇవ్వాల్సిందే అంటూ ఈ మధ్య మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జనసేఅని గట్టిగా గర్జించాక పసుపు శిబిరంలో వేగంగా వచ్చిన మార్పులు ఇవి. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన పార్టీ, మనకేమి తక్కువ. జనాలకు ఎంతో చేశాం., ఎన్నో ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు.
ఇక ఒక్క చాన్స్ అంటూ ఏపీలో వైసీపీ పాలనను జనాలు కోరుకున్నారు. కానీ మూడేళ్ళకే దారుణంగా విసిగిపోయారు. వారికి ఏ మాత్రం మేలు చేయలాన్నా కూడా ఇపుడు కళ్ళకు కనిపించేది సమర్ధవంతమైన పార్టీగా ఉన్న టీడీపీ మాత్రమే. అలాగే ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా ప్రజలు టీడీపీనే గెలిపిస్తారు. ఏకైక ఆల్టర్నేషన్ గా ఏపీలో ఈ రోజుకీ తమ పార్టీయే ఉంది అని కూడా అంటున్నారు.
ఇక జనసేనతో పొత్తులు ఉంటే భారీ మెజారిటీలు రావచ్చు, కానీ ఆ పార్టీ పెట్టే డిమాండ్లు, అధికారంలో వాటా వంటివి మాత్రం టీడీపీ పెద్దలకు మింగుడుపడకుండా చేస్తున్నాయట. అందుకే సోలోగానే ఫైట్ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే తానుగా జనసేన కానీ ఇతర విపక్షాలు కానీ వచ్చి దోస్తీ కడితే స్వాగతిందాలని కూడా ఆలోచిస్తున్నారు.
కానీ తమంతట తాము పొత్తుల పేరిట తగ్గాల్సింది లేదని కూడా కీలక నిర్ణయం తీసుకున్నారుట. ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తున్న తెలుగుదేశం పార్టీకి సోలో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, జనసేనతో కలసి వస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది అంటున్నారు.
ఈ సర్వే నివేదికల ప్రకారం జనసేనతో పొత్తు ఉంటే చాలా చోట్ల ఊహించని కళ్ళు చెదిరే భారీ మెజారిటీలు నమోదు అవుతాయట. అదే టీడీపీ సింగిల్ గా రంగంలో ఉంటే పెద్ద మెజారిటీలు రాకపోయినా సీట్లకు అయితే ఢోకా లేదని అంటున్నారు. గెలుపు అవకాశాలు బాగా ఉండడంతో పాటు మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లా కంటే కూడా ఎక్కువ వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. సెంచరీ టీడీపీకి కచ్చితంగా వస్తుందని, ఆ మీదట వేవ్ ఉంటే నంబర్ ఎక్కడిదాకా వెళ్తుందో కూడా తెలియదు అని అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే ఈ రోజుకు టీడీపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయీ అంటే పొత్తుల గురించి పట్టించుకోకుండా మొత్తం 175 సీట్లలోనూ సైకిల్ ని పరుగులు తీయించడం. అన్ని సీట్లలో బలమైన అభ్యర్ధులను గుర్తించి పోటీకి రెడీ చేసి పెట్టడం. గెలిచేది, నిలిచేది ఏపీలో టీడీపీనే అన్న మాటకు ఆ పార్టీ ఫిక్స్ అయిపోయిందట. సో పొత్తులు లేకపోయినా విజయం మాదే అని అంటోంది. మరి గ్రౌండ్ లెవెల్ లో సీన్ అలా ఉందా. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత అంతా ఒక్క టీడీపీకే టర్న్ అవుతుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.