ఏపీకి ఊరట.. తెలంగాణకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Update: 2022-04-29 09:46 GMT
ఏపీ విభజన సమస్యల లొల్లి ముదురుతూనే ఉంది. ఏపీ, తెలంగాణ విడిపోయినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేంద్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అసలు పరిష్కరించడం లేదు. దీంతో విభాజిత ఏపీకి అన్యాయం జరుగుతుండగా.. సంస్థలన్నీ ఉన్నా తెలంగాణ లాభపడుతోంది. ఈ క్రమంలోనే  తెలుగు అకాడమీ విభజన సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

తెలుగు అకాడమీ విభజన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ లో ఉన్న రూ.33 కోట్ల వడ్డీతో సహా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలోనే పిటీషన్ ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా.. ఏపీకి ఇప్పటికే రూ.92.94 కోట్లు చెల్లించినట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. అయితే మిగిలిన డబ్బు మొత్తానికి 6 శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
 
ఇప్పటికే రెండు రాష్ట్రాల మద్య అంతర్రాష్ట్ర జలవివాదాలు, నీటి కేటాయింపులు, ఉద్యోగుల విభజన కేటాయింపులు, పెండింగ్ లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి   హైదరాబాద్ లో  అధికారుల మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ తెగని విద్యుత్ వినియోగం.. ఉన్నత విద్య, అబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడానికి జగన్ గతంలో చొరవచూపారు. కానీ ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం.. వాళ్లు సుప్రీంకోర్టుకు ఎక్కడంతో సమస్య క్లిష్టంగా మారింది.  

తెలుగు అకాడమీలో మొదటి విడతగా రూ.92 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాకు బదిలీశారు. నిధులు, సిబ్బందిని 42.58 నిష్పత్రిలో పంచుకోవాలని ఉంది. రాష్ట్ర విభజన నాటికి నిధులు,  అప్పటినుంచి వడ్డీ కలిపి దాదాపు 190 కోట్ల వరకూ ఏపీకి పంచాలి.

అందులో మొదటి విడత రూ.92 కోట్లను తెలంగాణ ఇచ్చింది. సిబ్బంది విభజన జాబితా కూడా నేడో రేపో వెలువడనుంది. విభజన వ్యవహారం పై సుప్రీంకోర్టులో ఈనెల 29న కేసు విచారణకు రానుంది. ఆలోపు పంపిణీ పూర్తికాకపోవడంతో తెలంగాణకు సుప్రీంకోర్టు షాకిచ్చింది.
Tags:    

Similar News