ఆంధ్రప్రదేశ్ అంటే అబ్బో అంటున్నారు పరిశీలకులు. సంక్షేమ పథకాల అములు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో, అప్పులు చేయడంలోనూ ఇలా పలు రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సీబీఐ కేసుల జాబితాలోనూ నెంబర్ వన్ స్థానంలో నిలిచి నివ్వెర పరుస్తోంది. గత ఐదు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన నమోదైన సీబీఐ కేసుల్లో అత్యధికంగా ఏపీలోనే ఎక్కువగా నమోదయ్యాయట. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పార్లమెంటు సాక్షిగా ఈ వివరాలను బయటపెట్టారు.
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై వచ్చిన వివిధ అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రజా ప్రతినిధులపై కేసులు బనాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీబీఐ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవి అనే విమర్శలు విపక్షం ఎలాగూ చేస్తోంది.
ఇవన్నీ అలా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో దేశంలో ప్రజా ప్రతినిధులపైన ఎన్ని కేసులు నమోదయ్యాయి, రాష్ట్రాల వారిగా జీబితా ఇవ్వమని పార్లమెంటులో కొంతమంది ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సమాధానమిస్తూ విస్తుగొలిపే అంశాలు వెల్లడించింది.
2017-22 మధ్య కాలంలో మొత్తం 56 కేసులను ఎంపీలు, ఎమ్మెల్యేలపైన సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇందులో అత్యధికంగా 10 కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపంది. ఆ తరువాత స్థనాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో చెరో 6 కేసులు నమోదయ్యాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో 5, పశ్చిమ బెంగాల్ లో 5, తమిళనాడులో 4, మణిపూర్ లో 3, ఢిల్లీలో 3, బీహార్ లో 3, జమ్మూ కశ్మీర్ 2, కర్ణాటకలో 2 కేసులు, హర్యానాలో 1, చత్తీస్ గఢ్ లో 1, మేఘాలయలో 1, ఉత్తరాఖండ్ లో 1, మధ్యప్రదేశ్ లో 1, మహారాష్ట్రలో 1, లక్షద్వీప్ లో 1 కేసు నమోదైనట్టు వివరించారు.
ఇలా ఉండగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సీబీఐ నమోదు చేసిన మొత్తం 56 కేసుల్లో ఇప్పటి వరకు 22 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయడం జరిగిందని కేంద్రం తెలిపింది. సీబీఐ కేసుల్లో దోషులుగా తేలిన వారి శాతం 2017లో 66.90 శాతముంటే అది 2021లో 67.56శాతంగా నమోదైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.