రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాదం రాజుకుంది. అవసరం లేకున్నా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేస్తోందని.. అసలు అవసరమే లేదని.. అయినా.. కూడా ఏపీని రెచ్చగొట్టే ధోరణిలోవ్యవహరిస్తోందని.. రాష్ట్ర ప్రభత్వం పేర్కొంది.
జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రంలోని కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డ్(కేఆర్ఎంబీ) చైర్మన్ కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉందని ఏపీ అధికారులు లేఖలో పేర్కొన్నా రు. తెలంగాణ జల విద్యుత్ ఉత్పాదన వలన నీరు వృథాగా సముద్రంలోకి వెళుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇలా చేయటం వల్ల సీజన్ చివరిలో పంటలు సాగు, తాగునీరుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను ఏపీ అధికారులు కోరారు.
అయితే.. గత సాగర్ ఉప ఎన్నిక సమయంలోనూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుగానే వ్యవహరించా రు. సాగర్ జలాల్లో వాటాను మించి వినియోగించారని.. అప్పట్లో ఏపీ అధికారులు.. ప్రభుత్వం కూడా ఆరోపించారు. అయితే.. అప్పట్లో కేవలం ఆరోపణల వరకే పరిమితం అయిన.. ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా.. కేంద్రానికి లేఖలు రాసే వరకు వచ్చింది.
ఇటీవలే.. అంతో ఇంతో ఇరు రాష్ట్రాల మధ్యసంబంధాలు బలోపేతం అవుతున్నాయని భావిస్తున్న సమయంలో ఇలా.. ఇప్పుడు మరోసారి.. జల రాజకీయం తెరమీదికి రావడంతో ఇరు రాష్ట్రాల మధ్య కీచు లాటలు ఓ రేంజ్‌లో పెరుగుతాయని అంటున్నారు పరిశీలకులు.మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.