ఏపీ వ‌ర్సెస్ తెలంగాణ‌.. విభ‌జ‌న అంశాల‌పై ఎవ‌రి వాద‌న ఏంటి.. తాజా వివాదం ఏంటి?

Update: 2023-01-09 12:30 GMT
ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను.. తక్షణమే విభజించాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిష‌న్‌పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం అవుతుండ‌డం తెలిసిందే.

అయితే.. దీనికి ప‌రిష్కారం కూడా.. విభ‌జ‌న చ‌ట్టంలోనే ఉంది. జ‌నాభా నిష్ప‌త్తి(ఏపీ 58:42 తెలంగాణ‌) ప్రాతి పదికన‌.. ఈ సంస్థ‌ల‌ను విభ‌జించుకోవాల‌ని.. ఇదే చ‌ట్టం పేర్కొంది. అయితే.. కేసీఆర్ దీనిని విభేదిస్తూ వ‌చ్చారు. 'ఎక్క‌డి సంస్థ‌లు అక్క‌డే' అన్న ప్రాతిప‌దికన ఉంచేయాల‌ని పార్ల‌మెంటులోనూ అప్ప‌టి బీఆర్ ఎస్ ఎంపీలు వాదించారు. ఇక‌, ఏం జ‌రిగిందో ఏమో.. ఈ విష‌యం మ‌రుగున ప‌డింది.

వాస్త‌వానికి చంద్ర‌బాబు హ‌యంలోనే వీటిని ప‌రిష్క‌రించేందుకు.. కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. అప్ప‌ట్లో కేంద్రం జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉంద‌ని.. కేంద్ర‌ మంత్రిగా ఉన్న వెంక‌య్య నాయుడు రాజ్య‌స‌భ‌లో స్ప‌ష్టం చేశారు.

అయితే.. ఆత‌ర్వాత‌.. ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన ద‌రిమిలా.. ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసింది. 'ఇది మేం తేల్చుకుంటాం' అని పేర్కొంది.

దీంతో ఈ విష‌యం అప్ప‌టి నుంచి గోప్యంగానే ఉండిపోయింది. కానీ, త‌ర‌చుగా.. విద్యుత్ ఉద్యోగుల సమ‌స్య‌,విద్యుత్ బ‌కాయిల సమ‌స్య‌, నాగార్జున సాగ‌ర్ జ‌లాలు వంటివి తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. విభ‌జ‌న చ‌ట్టంలోని షెడ్యూల్ 9-10 తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ఇక‌, ఇప్పుడు అనూహ్యంగా ఈ విష‌యాల‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టు వ‌ర‌కు తీసుకువెళ్లింది. ఈ క్ర‌మంలో సుప్రీం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. ఎలా చూసుకున్నా.. తెలంగాణ దిగిరాక త‌ప్ప‌ద‌నే భావ‌న న్యాయ‌నిపుణుల్లోనే ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News