విద్యుత్తు ఉద్యోగుల తొలగింపు చెల్లదు

Update: 2015-09-11 17:30 GMT
విద్యుత్తు ఉద్యోగులను తొలగించే అధికారం తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థలకు లేదని, వాటి యజమాని ఇంకా ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థనేనని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. తనకు లేని  అధికారంతో తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, అయినా కేంద్ర ప్రభుత్వం కానీ న్యాయయస్థానాలు కానీ ఏమీ చేయలేకపోతున్నాయని ఉద్యోగులు వివరిస్తున్నారు.

వాస్తవానికి, రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత దీనిని రెండుగా విభజించారు. అయితే, దీని ఆస్తులు, అప్పుల విభజనకు షిలా బిడే కమిటీని నియమించారు. ఆ కమిటీ తన నివేదికను ఇంకా ప్రభుత్వానికి సమర్పించలేదు. దాంతో ఆస్తులు, అప్పలు విభజన కూడా పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన చట్టం, విద్యుదుత్పత్తి నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పుల విభజన పూర్తి కాకపోతే వాటి యజమాని ఆంధ్రప్రదేశ్ విద్యదుత్పత్తి సంస్థ మాత్రమేనని అంటున్నారు. అంటే, తెలంగాణ ప్రత్యేకంగా విద్యుదుత్పత్తి సంస్థను ఏర్పాటు చేసుకున్నా.. దాని ఆస్తులకు, ఉద్యోగులకు పూర్తి యజమాని ఏపీ జెన్ కో మాత్రమే. ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా ఏపీజెన్ కోనే తీసుకోవాలని, ఆస్తులు, అప్పుల విభజన పూర్తయిన తర్వాత మాత్రమే విభజన పూర్తిగా జరిగినట్లని, అప్పుడు మాత్రమే ఉద్యోగులపై అధికారం టీ జెన్ కోకు ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉద్యోగులను టీ జెన్ కో తొలగించడం అన్యాయమని వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానంతోపాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని విద్యుత్తు ఉద్యోగులు భావిస్తున్నారు.
Tags:    

Similar News