న‌కిలీ వివాదంలో అశోక్ బాబు!..బాబుకు ఇబ్బందే!

Update: 2019-01-10 13:39 GMT
ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ అధికార టీడీపీలో అంత‌కంత‌కూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో దాదాపుగా ఏపీలోని అన్ని జిల్లాల్లో పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. మూడు ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన టీడీపీకి... ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు కొద‌వేమీ లేకున్నా... గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే టికెట్ ఇస్తాన‌న్న పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు లెక్క‌ల ప్ర‌కారం చూస్తే... చాలా చోట్ల అభ్య‌ర్థులు దొర‌క‌ని ప‌రిస్థితి. అంతేకాకుండా ఎప్పుడూ కొత్తొళ్ల కోసం వెంప‌ర్లాడే చంద్ర‌బాబు నైజం... ఏ కొద్ది మందికో మిన‌హా మెజారిటీ నేత‌ల‌త‌కు ఆశించిన‌న్ని అవ‌కాశాలు ద‌క్క‌వు. అంద‌రూ సీనియ‌ర్లైతే త‌న‌కే ఏకు మేకుల్లా మార‌తార‌న్న బాబు భ‌య‌మే... కొత్త‌వారికి టీడీపీ ఎప్పుడూ ఆహ్వానం ప‌లుకుతూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఏపీఎన్జీవో అధ్య‌క్షుడిగా ఉన్న స‌ర్కారీ ఉద్యోగి అశోక్ బాబుకు పార్టీ నుంచి ఆహ్వానం అందింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా బ‌హిరంగ వేదిక మీదే అశోక్ బాబును త‌న పార్టీలోకి ఆహ్వానించి చంద్ర‌బాబు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. తెర వెనుక చాలా రోజుల నుంచే అశోక్ బాబును పార్టీలోకి లాగాల‌న్న క‌స‌ర‌త్తు జ‌రుగుతున్నా... బాబు బ‌హాటంగానే ఆ వ్యాఖ్య చేసి సంచ‌లనం సృష్టించారు.

అయితే నాడు బాబు ఆహ్వానం ప‌లికిన అశోక్ బాబు... ఇప్పుడు పెద్ద సుడిగుండంలో చిక్కుకున్నారు. ఏపీ వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ఉద్యోగం వెల‌గ‌బెడుతున్న అశోక్ బాబు... ఉద్యోగ సంఘాల నేత హోదాలో పొలిటీషియ‌న్ల కంటే కూడా ఉన్న‌తాధికారుల‌ను హ‌డ‌లెత్తిస్తున్న వైనం మ‌న‌కు కొత్తేమీ కాదు. తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్నంత కాలం అశోక్ బాబు లీలలు అంత‌గా బ‌య‌ట‌కు రాలేదు గానీ... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎన్డీఏ సంఘాలు విభ‌జ‌న కూడా అనివార్యంగా మారింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాదులోని ఖ‌రీదైన ప్రాంతంలో ఉన్న ఏపీఎన్జీవో భ‌వ‌నం స్థ‌లం విష‌యంలో నెల‌కొన్న వివాదంలో ఏకంగా అశోక్ బాబు త‌న్నులు కూడా తిన్నారు. ఈ క్ర‌మంలో అశోక్ బాబుకు సంబంధించిన ఒక్కో అక్ర‌మం బ‌య‌ట‌కు రావ‌డం ప్రారంభ‌మైంది. సంఘం నిధుల వ్య‌వ‌హారం - ఉద్యోగుల వేతనాల‌ను స‌ర్కారీకి విరాళంగా ఇవ్వ‌డం త‌దిత‌ర విష‌యాల‌పై అశోక్ బాబు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నార‌న్న వాద‌న లేక‌పోలేదు. ఈ కార‌ణంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల‌న్నీ ఎన్జీఓ కిందే ఉన్నా... ఏపీలో ఇప్పుడు అశోక్ బాబుకు వ్య‌తిరేకంగా చాలా సంఘాలు తెర మీద‌కు వ‌చ్చాయి. ఈ సంఘాల నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌న్నీ అశోక్ బాబుకు పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇవ‌న్నీ ఒక ఎత్తైతే... ఇప్పుడు అశోక్ బాబుకు సంబంధించిన మ‌రో వివాదం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రో 3 నెల‌ల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న అశోక్ బాబు... అనూహ్యంగా వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే తాను ఉద్యోగం సంపాదించిన ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో కాకుండా తాను ఎప్పుడో పూర్తి చేసిన‌ట్లు క‌ల‌రింగ్ ఇస్తున్న డిగ్రీ స‌ర్టిఫికెట్ ఆస‌రాతో ఆయ‌న స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ డిగ్రీ స‌ర్టిఫికెట్ ఇప్పుడు ఆయ‌న‌ను స‌త‌మ‌తం చేస్తోంది. ఎందుకంటే... ఆ డిగ్రీ స‌ర్టిఫికెట్ అసలుది కాద‌ట‌. న‌కిలీద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న సొంత శాఖ అయిన‌ వాణిజ్య పన్నుల శాఖలోని అంత‌ర్భాగ‌మైన‌ విజయవాడ సర్కిల్-1 ప్రెసిడెంట్ మెహర్ బ‌య‌ట‌పెట్టారు. అశోక్ బాబు స‌మ‌ర్పించిన డిగ్రీ ప‌ట్టా న‌కిలీదేన‌ని, దీని ఆధారంగా ఆయ‌న వీఆర్ ఎస్‌ కు అనుమ‌తి ఇవ్వ‌రాద‌ని కూడా ఆయ‌న ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వివాదం పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో టీడీపీలో చేరేందుకే వీఆర్ ఎస్ తీసుకుందామ‌ని భావిస్తున్న అశోక్ బాబు... తాను స‌మ‌ర్పించిన స‌ర్టిఫికెట్ న‌కిలీద‌ని బ‌య‌ట‌ప‌డ‌టంతో... ఈ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాల‌న్న విష‌యంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... చంద్ర‌బాబు కూడా ఇలాంటి నేత‌ల‌నే ప్రోత్స‌హిస్తార‌న్న మ‌రో వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో తొమ్మిదిన్న‌రేళ్లు - ఇప్పుడు ఐదేళ్లుగా సీఎంగా ప‌నిచేసిన‌, చేస్తున్న చంద్ర‌బాబుకు అశోక్ బాబు గుట్టుమ‌ట్లు అన్ని తెలిసే ఉంటాయి క‌దా. మ‌రి ఆ లొసుగుల‌న్నీ తెలిసే... ఆయ‌న‌ను చంద్ర‌బాబు పార్టీలోకి ఆహ్వానించారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. చంద్ర‌బాబుకు ఈ త‌ర‌హా నేత‌లైతేనే స‌రిపోతారు అన్న ఓ ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా అశోక్ బాబుకు వీఆర్ ఎస్ ఘాయ‌మ‌ని, టీడీపీలోకి ఆయ‌న ఎంట్రీ కూడా ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.


Full View

Tags:    

Similar News