ఫోర్బ్స్ లిస్టులో ఇండియన్ యంగ్ సంపన్నులు

Update: 2016-12-14 11:56 GMT
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో కొత్తగా ఇద్దరు భార‌తీయ అమెరికన్లు చోటు ద‌క్కించుకున్నారు.  40ఏళ్లలోపు వయసున్న అమెరికన్ సంపన్నుల లిస్టును ఒకటి ఫోర్బ్స్ విడుదల చేసింది.. ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అందులో ఫస్టు ప్లేసు కొట్టేశారు. కాగా ఈ జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లు వివేక్ రామ‌స్వామి - అపూర్వ‌ మొహ‌తాలకు చోటు దక్కింది.
    
వివేక్ రామస్వామి వయసు 31.  ఆయన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం - యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌ లో చదువుకున్నారు. బయోటెక్‌ పారిశ్రామికవేత్త అయిన ఆయనకు మొత్తం 600 మిలియన్‌ డాలర్ల సంపద ఉంది. ఫోర్బ్స్ జాబితాలో  24వ స్థానం దక్కించుకున్నారు. రామ‌స్వామి కంపెనీ 2016లో స్టాక్‌ మార్కెట్‌ లో ముందస్తు పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీవో)కు వచ్చి 218 మిలియన్‌ డాలర్ల షేర్లను నాస్‌ డాక్‌ లో విక్రయించింది.
    
కాగా మరో సంపన్నుడు అపూర్వ మెహతాకు 31 వస్థానం దక్కింది.  ఆయనది 360 మిలియన్‌ డాలర్ల సంపద.  2012లో నిత్యావసరాలను సరఫరా చేసే సంస్థ  'ఇన్‌ స్టాకార్ట్‌'ను ఆయన స్థాపించారు.  భారత్‌ లో పుట్టిన మెహతా కుటుంబం 2000 సంవత్సరంలో కెనడాకు వచ్చింది. ఆయన బ్లాక్‌ బెర్రీ - క్వాల్కమ్‌ - అమెజాన్‌ లలో పనిచేశారు. కాగా  ఫోర్బ్స్  జాబితాలో తొలిస్థానంలో నిలిచిన జుకర్‌ బర్గ్‌ సంపద విలువ 50 బిలియన్‌ డాలర్లు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News