తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ లో తాము ఒక కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా వచ్చిన వార్తలపై యాపిల్ అధికారికంగా రియాక్ట్ అయ్యింది. కొత్తగా డెవలప్ మెంట్ ఆఫీసును తాము ఏర్పాటు చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన యాపిల్.. ఇందులో సుమారు 150 మంది ఉద్యోగులు ఉంటారని పేర్కొంది. వీరంతా యాపిల్ మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొంటారని స్పష్టం చేసింది.
అయితే.. ఈ ఏర్పాటుకు కాస్త సమయం పట్టనుంది. ఈ ఏడాది చివర్లో మాత్రమే యాపిల్ తన కొత్త కార్యాలయానికి సంబంధించిన పనులు షురూ చేసే వీలుంది. అమెరికాలోని క్యూపర్టినోలోని కొత్త కార్యాలయంలోకి హెడ్ క్వార్టర్స్ కి సిబ్బందిని తరలించే సమయంలోనే హైదరాబాద్ లో ఆఫీస్ పనులు స్టార్ట్ కానున్నాయి. సుమారు 25 మిలియన్ డాలర్లతో ప్రారంభించనున్న యాపిల్ కార్యాలయ నిర్మాణంలో దాదాపుగా 4500 మంది పాలు పంచుకునే వీలుంది. ఏమైనా యాపిల్ కొత్త ఆఫీసును 2017లో చూసే వీలుందన్న మాట.