ఇప్పటివరకు ఉత్తర భారతానికే పరిమితమైన ఆపిల్ సాగు.. తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో సాకారమైంది. కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ తొలిసారి ఆపిల్ పండ్లు పండించారు. ఈ సందర్భంగా తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజి తొలి కాతను మంగళవారం ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్కను, పండ్ల బుట్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్ ఆర్ 99 ఆపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగు పై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాలాజీని అభినందించారు. తెలంగాణ నేలల విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అన్నారు.