పాత ఐఫోన్లు ఉంటే ‘బంగారమే’

Update: 2016-04-16 09:12 GMT
ప్రపంచ స్మార్టుఫోన్ మార్కెట్ లో ఐఫోన్ కు ఉన్న క్రేజే వేరు.  యాపిల్ సంస్థకు అది బంగారం లాంటి ఫోన్... బంగారం లాంటి ఏంటి? నిజంగా బంగారమేనంట. ఎందుకంటే ఐఫోన్ల  వేస్టేజి నుంచి యాపిల్ సంస్థ ఏకంగా టన్ను బంగారం సేకరించిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే.

ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారాన్ని వినియోగించడానికి ఒక కారణం ఉంది. పరికరాల్లోని కొన్ని భాగాలు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం పనిచేసేలా ఉండేందుకు... అత్యుత్తమ విద్యుత్ వాహకాలుగా పనిచేయాలన్నా బంగారంతో వాటిని తయారుచేస్తారు. వెండిని - రాగిని కూడా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో వాడతారు.  ఎలక్ట్రాన్ల ప్రవాహం బంగారంలో అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని కీలక భాగాలను బంగారంతోనే రూపొందిస్తారు. యాపిల్ ఫోన్లలోనూ అలాగే వాడుతారు.. పైగా నాణ్యతకు పెద్ద పీట వేసే సంస్థ కాబట్టి మిగతా ఫోన్ల కంటే ఎక్కువ భాగాలను బంగారంతో తయారుచేస్తారు.

అయితే... ఏ ఎలక్ర్టానిక్ పరికరమైనా పాడవుతుంది... యాపిల్ ఉత్పత్తులూ అందుకు భిన్నమేమీ కాదు. అలా పాడైన యాపిల్ ఉత్పత్తులను మళ్లీ సేకరించి అందులోని బంగారాన్ని తీస్తారట. యాపిల్ సంస్థ ఇలా పాత గాడ్జెట్లను - ఫోన్లను రీసైక్లింగ్ చేసి బంగారాన్ని సేకరిస్తుంది.  కంపెనీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఎక్కువగా పాత ఐఫోన్లలోనే పెద్ద మొత్తంలో బంగారం వస్తుందట. సగటున ఒక్కె ఐఫోన్ తయారీలో ౩౦ మిల్లీగ్రాముల బంగారం ఉపయోగిస్తారు. గత ఏడాది ఇలా పాత ఐఫోన్లు - ఐప్యాడ్లు - ఐమ్యాక్ ల నుంచి టన్ను కంటే ఎక్కువ బంగారాన్ని సేకరించారట. వాటిని రీసైక్లింగ్ చేసి అందులోని బంగారాన్ని సేకరించారు. అలా పాత ఫోన్ల నుంచి సేకరించిన బంగారం వేల్యూ సుమారు 4 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. యాపిల్ సంస్థ ఏటా వెల్లడించే ఎన్విరాన్ మెంట్ రిపోర్టులో ఈ వివరాలన్నీ ప్రకటించింది.

కాగా సుమారు 5 కోట్ల కేజీల ఐ-వేస్టు(యాపిల్ ఈ-వేస్టు) రీసైక్లింగ్ చేస్తామని..  పునర్వినియోగ పదార్థాల నుంచి 61 మిలియన్లు రాబట్టుకున్నామని యాపిల్ సంస్థ తెలిపింది. బంగారంతో పాటుగా 23 మిలియన్ పౌండ్ల ఉక్కును, 13 మిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ ను, 12 మిలియన్ పౌండ్ల గ్లాస్ ను, 4.5 మిలియన్ పౌండ్ల అల్యూమినియంను, 3 మిలియన్ పౌండ్ల కాపర్ ను, 6,600 పౌండ్ల సిల్వర్ ను రీసైక్లింగ్ ద్వారా సేకరించారట.
Tags:    

Similar News