టెక్నాలజీ రంగంలో అగ్రభాగాన ఉన్న యాపిల్ సంస్థకు ఇప్పుడు గడ్డు కాలం ఎదురైంది. కంపెనీ సేల్స్ క్రమంగా పడిపోతుండడంతో ఆ సంస్థ నష్టాల బాటలో పయనిస్తోంది. చైనాతో పాటు హాంగ్ కాంగ్, తైవాన్ దేశాల్లో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. చైనా మార్కెట్ పెద్దదైనా అక్కడ ఆదరణ తగ్గింది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సేల్స్ తగ్గిపోవడంతో సంస్థ సీఈవో టిమ్ కుక్ ఆందోళన వ్యక్తం చేశారు.
యాపిల్ సంస్థ నష్టాలకు చైనాయే దీనికి కారణమని ఆయన అభిప్రాయ పడ్డారు. చివరి త్రైమాసికం యాపిల్ సంస్థను దెబ్బతీసిందన్నారు. కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా ఆయన పరోక్షంగా ఇదే సందేశాన్ని పంపించారు. ఇది ఒక రకంగా 20 శాతం నష్టాన్ని తీసుకొచ్చినట్టు టిమ్ కుక్ ఓ లేఖలో ఇన్వెస్టర్లకు తెలియజేశారు. టిమ్ అభిప్రాయం, సంస్థల నష్టాల్లో ఉందన్న ప్రచారంతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళనకు గురవుతున్నారు.
యాపిల్ కంపెనీల షేర్లు క్రమంగా పతనమవుతున్నాయి. గతేడాది డిసెంబరు, నవంబరు మాసాల్లో అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదని ఆ సంస్థ వెల్లడించింది. తాజాగా షేర్ ధర ఏడు శాతం పడిపోయింది. పండుగ సీజన్ లో యాపిల్ నష్టాల వైపు వెళ్తున్న తీరు చూస్తుంటే ఆ సంస్థకు మునుముందు మరిన్ని ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు కనిస్తున్నాయి.
యాపిల్ సంస్థ నష్టాల బారిన పడడం వెనక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. చైనా, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఐఫోన్ ధరలు అధికంగా ఉండడంతో విక్రయాలు పడిపోతున్నాయి. దీని ప్రభావం షేర్లపై పడుతోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Full View