ఐఫోన్ డేటాను tiktok దొంగ తనం చేస్తుందా ?

Update: 2020-06-29 11:34 GMT
మీరు టిక్ టాక్ యాప్ ను ఉపయోగిస్తున్నారా? అందులో  వీడియోలు చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్, ఫేమ్ కోసం, మనీ ఎర్నింగ్ కోసం అవసరం ఏదైనా  ఇండియాలో స్మార్ట్ మొబైల్ ఉన్న వారిలో 90 శాతం మంది టిక్ టాక్ ను వాడుతున్నారు. ప్రస్తుతం చాలామంది నిద్ర లేచినప్పటి నుండి మళ్లీ నిద్రపోయేవరకు అదే పనిగా టిక్ టాక్ లో వీడియోలు చేస్తున్నారు. అయితే , ఈ టిక్ టాక్ వల్ల కొంతమందికి మంచి జరిగితే ..చాలామందికి చెడు కూడా జరుగుతుంది.

ఈ చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ యూజర్ల డేటాని కాపీ చేస్తుందని ఐఫోన్ ios 14 తాజాగా బయట పెట్టింది. ఐ ఫోన్లో కీబోర్డు పై టైప్ చేసే ప్రతి అక్షరాన్ని కాపీ చేస్తుంది అని తెలిపింది. ఇలాంటి వాటిని ఆపేస్తామని గతంలో టిక్ టాక్ చెప్పిందని.. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఐఫోన్ 14 ios డెమో వెర్షన్ సందర్భంగా.. టీచర్ల డేటాను టిక్టాక్ కాఫీ చేస్తున్న విషయం బయటపడింది.
Tags:    

Similar News