ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ వీలైనంత తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కొద్దికాలం క్రితం వివాదాల ద్వారా వార్తల్లోకి ఎక్కిన గుజరాత్ తాజాగా ఓ ఆసక్తికరమైన అంశం ఆధారంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలో గత ఐదేళ్ల నుంచి హిందూ మతంలో చేరేందుకు పలు మతాల వారు ఆసక్తి చూపుతున్నారు. హిందూ మతంలోకి కలపాలంటూ వివిధ మతాల వారికి చెందిన 1,838 దరఖాస్తులు గుజరాత్ ప్రభుత్వానికి అందాయి.
గుజరాత్ రాష్ట్ర నిబంధనల ప్రకారం పౌరుడు మతం మార్చుకోవాలంటే...జిల్లా అథారిటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర కులంలో పుట్టిన వారు తమ మతాన్ని త్యజించి హిందూ మతంలో చేర్చాలంటూ ఈ దరఖాస్తులు అందజేశారు. అయితే వచ్చిన దరఖాస్తుల్లో సగానికిపై గుజరాత్ ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం 878 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.