ఏపీఎస్ ఆర్టీసీలో కరోనా కలకలం ... 741 మందికి పాజిటివ్ !

Update: 2020-07-28 15:30 GMT
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇకపోతే ఏపీలో ఆర్టీసీ లో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకు ఆర్టీసీ సిబ్బందిలో మొత్తం 741 మందికి కరోనా సోకినట్టు, వారిలో ప్రస్తుతం 530 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. 90 శాతం మంది కరోనా వచ్చిన సిబ్బంది హోం క్వారెంటాయిన్‌ లో ఉన్నారని తెలిపారు. అత్యధికంగా కడప జోన్ ‌లో 260 మంది కరోనా బారిన పడ్డారు. ఆర్టీసీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలన్న అంశంపై నేడు ఉన్నతాధికారులతో ఎండీ సమావేశం నిర్వహించారు.

అయన మాట్లాడుతూ .. రొటేషన్ పద్దతిలో ఉద్యోగస్తులకు డ్యూటీ వేయమని అధికారుల చెప్పమని, రాష్ట్రంలోని పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లోని స్టాఫ్ కి సంజీవని బస్సులు ద్వారా టెస్ట్‌ లు చేస్తున్నామన్నారు. 11 వేల బస్సులు పైగా సర్వీసుల్లో కేవలం 2500 సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. ఎక్కువ సర్వీసులు నడపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల నుండి సరైన స్పందన లేదని తెలిపారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ రోజుకి 13 కోట్ల రూపాయల నష్టం వస్తోందని, ప్రభుత్వం లో ఆర్టీసీని విలీనం చేయకుండా ఉంటే కనీసం సిబ్బందికి జీతాలు కూడా చెల్లించే పరిస్థితి ఆర్టీసీకి ఉండేది కాదు అని తెలిపారు.

గడిచిన 24 గంటల్లో 7,948 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. మరో 58 మంది మరణించారు. దీనితో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,297కి చేరింది.
Tags:    

Similar News