క‌రోనా రాక‌పోవ‌డానికి కార‌ణం సూర్య‌భ‌గ‌వానుడే!

Update: 2020-04-19 14:48 GMT
ప్రపంచమంతా క‌రోనా వైర‌స్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ వైర‌స్ ధాటికి అగ్ర రాజ్యాలతో పాటు భార‌త‌దేశం గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఈ క్ర‌మంలో మ‌న దేశంలో కూడా ఆ మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంత‌గా ఈ వైర‌స్ ప్ర‌భావం లేదు. భార‌త‌దేశంలోని కొన్ని జిల్లాల్లో ఒక్క‌టంటే ఒక్క క‌రోనా కేసు న‌మోదు కాలేదు. దీంతో ఆయా ప్రాంతాల‌వాసులు ఖుషీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోనూ క‌రోనా కేసు ఒక్క‌టీ కూడా న‌మోదు కాలేదు. దీంతో ఆ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉన్నారు. అయితే త‌మ జిల్లాలో క‌రోనా వైర‌స్ రాక‌పోవ‌డానికి కార‌ణం త‌మ ఇల‌వేల్పు అర‌స‌విల్లి సూర్య‌నారాయ‌ణ స్వామి అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో సూర్య‌నారాయ‌ణ స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు.

సూర్యనారాయణ స్వామి కరుణా కటాక్షంతోనే జిల్లాలో కరోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌లేదని అరసవల్లి సూర్య‌నారాయ‌ణ స్వామి దేవాల‌య అర్చకులు చెబుతున్నారు. సాక్షాత్తు దేవేంద్రుడి ఆశీస్సులతో శ్రీకృష్ణ భగవానుడి సోదరుడైన బలరాముడు నిర్మించిన సూర్యనారాయణస్వామి దేవాలయం ఉండ‌డంతోనే క‌రోనా రావ‌డం లేద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో సూర్యభగవానుడికి ప్ర‌త్యేక పూజలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడటం కోసం.. ప్రతి ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలోని పండితులు వివిధ పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు. పది మంది రుత్వికులతో ఆలయ ప్రాంగణంలోని అనివెట్టి మండపంలో 108 పర్యాయాలు ఆదిత్య హృదయాన్ని పఠనం భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో చేస్తున్నారు. ఈ విధంగా ప్ర‌జ‌ల భావ‌న కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉంది.

Tags:    

Similar News