అరవింద్ ఫ్లాప్ షో.. కవిత రీఎంట్రీకి రెడీ

Update: 2019-11-08 10:27 GMT
ఒక్క ఓటమి.. కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితను రాజకీయాల నుంచి తాత్కాలికంగా దూరంగా జరిపేసింది. నిజామాబాద్ లో కవిత ఓటమి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేసీఆర్ సహా ఏ మంత్రి నిజామాబాద్ లో కాలు కూడా పెట్టడం లేదు. దీంతో అక్కడ అభివృద్ధి పడకేసిందని నేతలు, ప్రజలు మొత్తుకుంటున్నారు. కవిత గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదంటున్నారు.

అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లా లో పరిధిలో ఏకంగా కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలంటే కవిత యాక్టివ్ కావాల్సిందే. దీంతో కవిత మళ్లీ తన మనసు మార్చుకొని రాజకీయాల్లో క్రియాశీలం కావడానికి రెడీ అయ్యారట..

మొన్నటి ఎన్నికల్లో రైతులను కవితపై పోటీచేయించి పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర అంటూ హామీనిచ్చి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు అరవింద్. కానీ ఇప్పుడు అరవింద్ హామీలు అమలు కాక పోవడంతో అక్కడి రైతుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఎంపీగా గెలిచిన నెల రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని అరవింద్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆరు నెలలు అయినా అక్కడ పసుపు బోర్డు ఊసేలేదు. దీంతో అరవింద్ ను గెలిపించి తప్పు చేశామన్న భావన, అసంతృప్తి అక్కడి రైతుల్లో వ్యక్తమవుతోందట..

ఇప్పుడు అరవింద్ మోసం చేసిన వైనాన్నే ప్రజలకు వివరించడానికి కవిత రెడీ అయ్యిందట.. రైతుల అసంతృప్తిని ఓట్ల రూపంలో మలుచు కోవడానికి కవిత మళ్లీ నిజామాబాద్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సరే నిజామాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం.. బీజేపీని చిత్తుగా ఓడించేందుకు కవిత పట్టుదలగా ఉందట.. కవిత మళ్లీ తన మనసు మార్చుకొని యాక్టివ్ పాలిటిక్స్ రాబోతుండడం టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహ పరుస్తోంది.
Tags:    

Similar News