దేశవ్యాప్తంగా కరోనా ప్రబలింది.. వందల కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఏ రాష్ట్రం బాగా పనిచేస్తోంది. ఏ సీఎం కరోనా విషయంలో మెరుగ్గా రాణిస్తున్నారనే దానిపై జాతీయ చానెల్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. అందులో ఆశ్చర్యక ఫలితాలు వచ్చాయి.
దేశంలోనే కరోనా కట్టడిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అద్భుతంగా పనిచేస్తున్నాడని జాతీయ చానెల్ నిర్వహించిన సర్వేలో తేలింది. 65శాతం ప్రజలు కేజ్రీవాల్ బాగా పనిచేస్తున్నారని నమ్ముతున్నారు.
ఇక కేజ్రీవాల్ తర్వాత కర్ణాటక సీఎం యడ్యూరప్ప - తెలంగాణ సీఎం కేసీఆర్ - తమిళనాడు సీఎం - మహారాష్ట్ర సీఎంలు టాప్ 5లో నిలిచారు.
ఇక కరోనాపై పోరులో అస్సలు పనితీరు బాగాలేని సీఎం ఎవరంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఆమె పనితీరును 6శాతం మంది మాత్రమే బాగుందని చెప్పుకోవడం విశేషం.
నిజానికి ఈ జాతీయ చానెల్ హిందీ బెల్ట్ లో ఎక్కువగా చూస్తారు. దక్షిణాదిన పెద్దగా లేదు. దీంతో ఉత్తరాది ఓటర్లు సర్వేనే ప్రభావితం చేశారనే విమర్శలున్నాయి. దేశంలోనే కరోనా వెలుగుచూసిన తొలి రాష్ట్రం కేరళలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అందరూ సీఎంల కంటే కేరళ సీఎం బాగా పనిచేశారని ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనకే నంబర్ 1 స్థానమివ్వాలి. కానీ అత్యధికంగా కేసులు నమోదవుతున్న ఢిల్లీలో కేజ్రీవాల్ బాగా పనిచేస్తున్నారని సర్వేలో మొదటి ర్యాంకు కట్టబెట్టడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.