శనివారం మధ్యాహ్నానానికి ఉక్రెయిన్ నుండి భారత్ కు తిరిగి వస్తున్నారు. ఉక్రెయిన్ నుండి పక్కనే ఉన్న హంగేరీ దేశంలోకి భారత విద్యార్ధులు చేరుకుంటున్నారు. అక్కడి నుండి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబాయ్ కి మామూలు ప్యాసెంజర్లతో పాటు విద్యార్ధులు కూడా బయలుదేరారు. మొదటి విడతలో 22 మంది విద్యార్ధులు ఇండియాకు వస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ల ఇన్చార్జి టీ. కృష్ణబాబు చెప్పారు.
భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను బుకారెస్టు నుండి నడుపుతోంది. ఉక్రెయిన్లో అన్నీ విమానాశ్రయాలను మూసేసిన కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో వేరే దారిలేక కొందరు విద్యార్ధులు మొదట విమానాశ్రయంలో దాక్కున్నారు. అయితే అక్కడ కూడా బాంబింగ్ జరగటంతో అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఉక్రెయిన్లో మన విద్యార్ధులు సుమారు 25 వేలమందున్నారు. వీళ్ళు కాకుండా ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో మరో 5 వేలమందుంటున్నారు.
యుద్ధ నేపధ్యంలో ఈ వేలాదిమందిని దేశానికి తరలించటం కేంద్రప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. మొత్తం విద్యార్ధుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వేలమంది ఉన్నారు. వీళ్ళకోసమే రెండు ప్రభుత్వాలు 24 గంటలూ కాల్ సెంటర్లను నడుపుతున్నాయి. కాల్ సెంటర్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది. బుకారెస్టు నుండి మూడు ప్రత్యేక విమానాల్లో వీళ్ళంతా వస్తున్నారు.
శనివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి వచ్చే విమానంలో 13 మంది విద్యార్ధులొస్తున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు ఢిల్లీ, సాయంత్రం 4 గంటలకు ముంబాయ్ కు వచ్చే రెండు విమానాల్లో మరో 9 మంది విద్యార్ధులు వస్తున్నారు. విడతల వారీగా బుకారెస్టు నుండే ప్రత్యేక విమానాల్లో విద్యార్ధులను తరలించటానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. మొదట్లో కేంద్రప్రభుత్వం చెప్పినపుడే విద్యార్ధులు స్పందించుంటే ఇపుడీ సమస్య ఉండేది కాదు. యుద్ధం ప్రాంరంభానికి రెండువారాలకు ముందే భారత్ కు వచ్చేయమని కేంద్రం అప్పీలు చేసింది. అయితే దాన్ని విద్యార్ధులు పట్టించుకోలేదు. దాని ఫలితమే ఇపుడు అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.