అన్నీ దేశాలు కలిసి ఉక్రెయిన్ కొంప కూల్చేస్తున్నాయా ?

Update: 2022-06-20 04:07 GMT
వీలుంటే యుద్ధాన్ని ఆపి ఉక్రెయిన్ను రక్షించుకోవాలి. లేదంటే అన్నీ  దేశాలు కలిపి ప్రత్యక్షంగా రష్యాపై యుద్ధానికి దిగాలి. అంతేకానీ ఉక్రెయిన్ కు మద్దతుగా  ఊరికే ప్రకటనలిస్తు రష్యాను రెచ్చగొట్టడం వల్ల చివరకు చిట్టెలుక కొంప కూల్చేస్తున్నట్లే ఉందిచూస్తుంటే. తాజాగా నాటో దేశాల చీఫ్ జేమ్స్ స్టాలెన్ బర్గ్ చేసిన ప్రకటన అలాగే ఉంది. జేమ్స్ మీడియాతో మాట్లాడుతు కొన్నేళ్ళపాటు జరగబోయే యుద్ధంలో నాటో దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలవాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు.

ఇక్కడే అగ్రరాజ్యంతో పాటు  నాటో దేశాలతో ఉక్రెయిన్ కు పెద్ద సమస్య వచ్చిపడుతోంది. నాలుగు నెలలుగా రష్యాతో జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశం దాదాపు నాశనమైపోయింది. సైనికులు, మామూలు జనాలు కలిపి కనీసం లక్షమందైనా చనిపోయుంటారు. మరికొన్ని లక్షలమంది జనాలు దేశాన్ని విడిచి పారిపోయారు. ఇదంతా చూస్తున్న అమెరికా కానీ నాటో దేశాలు కూడా ఈరోజుకూ ఉక్రెయిన్ కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగలేదు.

ఎంతసేపు పరోక్ష యుద్ధానికి మాత్రమే రెడీ అంటున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను ముందుపెట్టి వెనకనుండి అవసరమైన నిధులు, ఆయుధాలిస్తున్నాయంతే. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న యుద్ధంలో చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ రష్యా సైన్యాన్ని తట్టుకోలేకపోతోంది.

ఇప్పటికే చాలా నగరాలను రష్యా తన ఆధీనంలోకి తీసేసుకున్నది. రాజధాని కీవ్ గనుక స్వాధీనం చేసుకుంటే యుద్ధం దాదాపు ముగిసిపోయినట్లే అనుకోవాలి. ఒకవైపు రష్యాదెబ్బకు ఉక్రెయిన్ కు జరుగుతున్న నష్టాన్ని చూస్తు కూడా ఒక్కదేశం కూడా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగలేదు.

ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకపోగా ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలను అందిస్తామని, సుదీర్ఘంగా జగరబోయే యుద్ధంలో తాము అండగా ఉంటామంటు ఉక్రెయిన్ కు మద్దతుగా మాట్లాడుతున్నాయి.

దీంతో రష్యాకు మండిపోతు మరింత రెచ్చిపోతోంది. దీనివల్ల ఉక్రెయిన్ లోని నగరాలు నాశనమైపోతున్నాయి. నిజంగానే ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడే ఉద్దేశ్యమే ఉంటే మద్దతుదేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగితే రష్యా వెనకడుగు వేస్తుందేమో. ఏదేమైనా మద్దతు ప్రకటనల కారణంగా ఉక్రెయిన్ను రష్యా చావగొట్టేస్తోంది.
Tags:    

Similar News