టీ20 వరల్డ్ కప్: వర్షం పేరిట మ్యాచ్ ల రద్దు.. ఆస్ట్రేలియా కుట్ర చేస్తోందా?

Update: 2022-10-29 15:31 GMT
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు టీ20 ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది ఆస్ట్రేలియా. సొంత దేశంలో జరుగుతున్న ఈ బుల్లి వరల్డ్ కప్ లో గత ప్రపంచకప్ చాంపియన్ హోదాలో అడుగిడిన ఆస్ట్రేలియా ఆ మేరకు రాణించలేక చతికిల పడుతోంది. ఆస్ట్రేలియా బలమైన జట్లపై నెగ్గదని తెలిసి తాజాగా కుట్రకు పాల్పడుతోందన్న అనుమానాలు క్రికెట్ ప్రపంచంలో వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా ట్వీట్ చేయడంతో ప్రపంచ క్రికెట్ లో పెనుదమారం రేగుతోంది.

న్యూజిలాండ్  చేతిలో ఓడిన ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్ లో ముందుకెళ్లడం కష్టం చేసుకుంది. ముఖ్యంగా శుక్రవారం జరగాల్సిన అప్ఘాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్ లు రద్దు అవ్వడం వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మొత్తం నాలుగు మ్యాచ్ లు వర్షానికి బలయ్యాయి. బంతిపడకుండానే రద్దు చేశారు.

ముఖ్యంగా ఆస్ట్రేలియా ఉన్న గ్రూప్ 1 మ్యాచ్ లు రద్దు కావడంతో అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మ్యాచ్ లు జరిగితే ఆస్ట్రేలియా సెమీస్ చేరడం కష్టమయ్యేది. ముఖ్యంగా బలమైన ఇంగ్లండ్ తో ఆస్ట్రేలియా తలపడితే ఓడిపోయేది.

తద్వారా టోర్నీ నుంచే నిష్క్రమించేదన్న వాదన ఉంది. న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ చేతిలోనూ ఓడితే ఇక ఇంటికే పోయేది. అందుకే వర్షం వల్ల ఈ మ్యాచ్ ను రద్దు చేయడంతో చెరో పాయింట్ తో ఆస్ట్రేలియా రేసులోకి వచ్చింది.

ఇక వర్షంతో రద్దు అయిన రెండు మ్యాచ్ ల స్టేడియం మెల్ బోర్న్ మైదానంలో నిర్వహణ లోపంతోనే రద్దు చేశారని తేలింది. మెల్ బోర్న్ మైదానాన్ని పూర్తిగా కప్పేసి రూఫ్ సౌకర్యం ఉన్నా ఎందుకు ఉపయోగించలేదని వాన్ ప్రశ్నించాడు.

శ్రీలంక వంటి చిన్న దేశాల్లోనూ పెద్ద వర్షాల తర్వాత స్టేడియాలను సిద్ధం చేస్తారని.. అధునాతన సౌకర్యాలున్న మెల్ బోర్న్ గ్రౌండ్ లో సిద్ధం చేయలేదని.. రెండు రోజులు రూఫ్ తో ఎందుకు కప్పి ఉంచలేదని వాన్ ప్రశ్నించాడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆస్ట్రేలియా ఇలా స్టేడియాన్ని వర్షంతో నిండిపోయేలా చేసిందన్న వాదనకు బలం చేకూరుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News