జంపింగ్స్ మీద జ‌నాలు అంత కోపంగా ఉన్నారా?

Update: 2019-05-04 10:44 GMT
ఎవ‌రికి వారు ఇష్టానికి పార్టీ మారేయ‌టం చూస్తున్న‌దే. పోటీ చేసేట‌ప్పుడు పార్టీ గురించి గొప్ప‌లు చెప్ప‌టం.. త‌ర్వాత అధికార పార్టీలోకి షిఫ్ట్ కావ‌టం లాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చోటుచేసుకుంటున్న వేళ‌.. ఇలాంటి వారి విష‌యంలో జ‌నాలు.. కార్య‌క‌ర్త‌లు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌టం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడా ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌ట‌మే కాదు.. మిగిలిన జంపింగ్స్ కు కొత్త గుబులు పుట్టేలా చేసింద‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన హ‌రిప్రియ విజ‌యంసాధించ‌టం తెలిసిందే. గెలిచిన త‌ర్వాత అనూహ్యంగా టీఆర్ ఎస్ లో చేరిన ఆమెపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన హ‌రిప్రియ‌పై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు రాళ్ల‌తో దాడి చేయ‌టంతో భీతావాహ ప‌రిస్థితి నెల‌కొంది.

ఖ‌మ్మం జిల్లా కామేప‌ల్లి మండ‌లం గోవింద్రాలలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన హ‌రిప్రియ‌ను క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌ల్లో గెలిపిస్తే.. పార్టీ మారిపోతారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల రాళ్ల‌దాడికి బ‌దులుగా.. టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు.. రాళ్లు విసిరారు. దీంతో.. ఇరు వ‌ర్గాల వారికి గాయాలు అయ్యాయి.

ఊహించ‌ని ప‌రిణామానికి ఎమ్మెల్యే హ‌రిప్రియ షాక్ తిన్న‌ట్లు చెబుతున్నారు. పార్టీ మారిన విష‌యంలో కార్య‌క‌ర్త‌లు ఇంత ఆగ్ర‌హంగా ఉన్నారా? అన్న విష‌యంపై ఆమె ఆలోచ‌న‌లో ప‌డేలా చేసిందంటున్నారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో పోలీసులు ఉన్న‌ప్ప‌టికీ.. వారిని కంట్రోల్ చేయ‌టం క‌ష్టంగా మారిందంటున్నారు. రెండు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఉండ‌టంతో.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా భారీ విధ్వంసం చోటు చేసుకుంటుంద‌న్న ఆలోచ‌న‌లో పోలీసులు వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా తెలుస్తోంది. ఏమైనా జంపింగ్స్ కు తాజా ఎపిసోడ్ ఒక హెచ్చ‌రిక లాంటిద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.


Tags:    

Similar News